|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంతార డైలాగులతో చిక్కుల్లో రణ్‌వీర్: దేవుళ్ళను అవమానించాడని కేసు నమోదు!

Published: 29-01-2026, 12:05 AM
కాంతార డైలాగులతో చిక్కుల్లో రణ్‌వీర్: దేవుళ్ళను అవమానించాడని కేసు నమోదు!
  • రణ్‌వీర్ సింగ్ పై బెంగళూరులో కేసు నమోదు
  • ‘కాంతార’ సినిమాలోని సన్నివేశాలను అనుకరించడంపై వివాదం
  • హిందూ దేవతలను అవమానించాడని ఆరోపణలు
  • భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ‘కాంతార’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుకరించినందుకు ఆయనపై బెంగళూరులో కేసు నమోదైంది. హిందూ దేవతలను కించపరిచేలా ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది.

రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదుకు కారణం?

Ranveer Singh: ఒకవైపు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ధురంధర్ (Dhuramdhar) సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోల జాబితాలో చోటు దక్కించుకొని.. కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేశారు. మరోవైపు ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా” ముగింపు కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ ‘కాంతార’ సినిమా గురించి పొగుడుతూనే.. ఆ సినిమాలో హీరో చేసిన హావ భావాలను కాస్త కామెడీగా చేసి చూపించారు. దీనితో ఇది కాస్త వివాదంగా మారింది.

వాళ్లు కొలిచే దైవానికి సంబంధించిన హావభావాలను వ్యంగ్యంగా.. వికృతంగా ఇంటర్నేషనల్ వేదికపై చూపిస్తూ.. రణ్ వీర్ సింగ్ అవమానపరిచారు అంటూ విమర్శలు చేయడమే కాకుండా దీనిని పెద్ద వివాదంగా మార్చేశారు. గతంలోనే పలువురు కేసులు కూడా రణ్ వీర్ పై పెట్టారు. దీంతో దిగివచ్చిన రణ్ వీర్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇక ఈ వివాదం కొద్ది రోజుల క్రితమే ముగిసింది అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదాన్ని మళ్లీ గుర్తు చేస్తూ బెంగళూరులో రణ్ వీర్ సింగ్ పై కేసు నమోదవడం సంచలనంగా మారింది.

లాయర్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు

బెంగళూరుకి చెందిన లాయర్ ప్రశాంత్ మెతల్ (Prashanth Methal).. బెంగళూరు హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్ లో హిందూ నమ్మకాలను , చావండి దైవ ఆచారాలను రణ్ వీర్ సింగ్ అవమానించాడని కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 196, 299, 302 సెక్షన్లపై రణ్ వీర్ సింగ్ పైన కేసు నమోదయింది. బెంగళూరు లాయర్ ప్రశాంత్ మెతల్ ప్రకారం ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. “గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ కాంతార దైవ ఆచారాలను ఇమిటేట్ చేస్తూ ఆ వేదికపై అవమానించారు. అయితే ఈ వీడియోని నేను ఇంస్టాగ్రామ్ లో చూసాను. రణ్ వీర్ సింగ్ పంజుర్లీ, గులిగా దైవాలతో సంబంధం ఉన్న వ్యక్తీ కరణలను హాస్య భరితమైన రీతిలో అనుకరించి, పవిత్రమైన చావుండి దైవాన్ని స్త్రీ దెయ్యంగా పేర్కొన్నాడు. దైవ సాంప్రదాయం పాటించే భక్తులకు ఇది మానసిక వేదనను కలిగించింది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి సమాజంలో దేశం ప్రోత్సహించే ఉద్దేశంతోనే రణ్ వీర్ సింగ్ ఈ చర్యకు పాల్పడ్డాడు అంటూ ఆయన తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

వివాదానికి దారితీసిన కాంతార సన్నివేశం

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏప్రిల్ 8వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందేనని త్వరలో రణ్ వీర్ సింగ్ కి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరి దీనిపై రణవీర్ సింగ్ స్పందిస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా ఒకవైపు తన సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంటే.. మరోవైపు ఆయనపై ఇలాంటి కేసు నమోదవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం సెలబ్రిటీలకు ఇది ఒక ఉదాహరణ. ఇకపై ఎవరు కూడా ఇలా అవమానపరిచే వ్యాఖ్యలు చేయరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు కావడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.