
📌 Key Points
- రణ్‌వీర్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ మూడేళ్ళ బ్యాన్ విధించింది.
- ‘కాంతార’లోని పంజుర్లి దైవాన్ని అసభ్యకరంగా అనుకరించడం వివాదానికి ప్రధాన కారణం.
- కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు రణ్‌వీర్ మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.
- న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడేందుకు క్షమాపణలు చెప్పి, ఆలయ దర్శనం చేశారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ‘కాంతార’ వివాదం కారణంగా మూడేళ్ళ బ్యాన్ ఎదుర్కొంటున్న ఆయన, కోర్టు ఆదేశాల మేరకు మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
బ్యాన్ వెనుక కాంతార వివాదం
Ranveer Controversy: ఒకవైపు మూడేళ్ళ నిషేధం, మరో వైపు కోర్టుల మొట్టికాయలు..వెరసి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కుంటున్నట్టే కనిపిస్తుంది.విషయంలోకి వెళ్తే నిన్నటికి నిన్న ఫర్హాన్ అక్తర్‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుండి రణ్‌వీర్ సింగ్ బయటికి రావడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ ఆయనపై మూడేళ్ళ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే.ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా మంగళవారం ఉదయాన్నే ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి మైసూరులోని చాముండేశ్వరి దేవిని దర్శించుకోవడం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపొయింది .
పంజుర్లి దైవాన్ని అసభ్యకర రీతిలో అనుకరణ
ఈ వివాదానికి బీజం గత ఏడాది నవంబర్ 30, 2025న గోవాలో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో పడింది. కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రిషబ్ శెట్టి సంచలన చిత్రం ‘కాంతార’లోని అత్యంత పవిత్రమైన పంజుర్లి దైవం హావభావాలను, దైవ నర్తనలను రణ్‌వీర్ సింగ్ వేదికపై వెక్కిరిస్తూ, అసభ్యకర రీతిలో అనుకరించారనే ఆరోపణలు వచ్చాయి.
కోర్టు ఆదేశాలతో ఆలయ దర్శనం
మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్
అంతటితో ఆగకుండా చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొన్నారంటూ కన్నడ ప్రజలు, సాంప్రదాయవాదులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రణ్‌వీర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరగడంతో, ఆయన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆ సినిమాలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను ప్రశంసించడమే తన ఉద్దేశమని, దేశంలోని ప్రతి సంస్కృతిని తాను గౌరవిస్తానని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వివరణ ఇచ్చారు కూడా. అయితే ఈ సోషల్ మీడియా క్షమాపణల్లో నిజాయతీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
రణ్‌వీర్ కెరీర్‌లో అనూహ్య మలుపులు
ఈ న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడేందుకు రణ్‌వీర్ సింగ్ 2026 ఏప్రిల్‌లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, సవరించిన అఫిడవిట్ ద్వారా న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నారు. ఆయన పశ్చాత్తాపాన్ని గమనించిన న్యాయస్థానం, నాలుగు వారాల గడువు విధిస్తూ మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువు ముగిసే చివరి నిమిషంలో రణ్‌వీర్ ముంబై విమానాశ్రయం నుండి నేరుగా మైసూరు చేరుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏది ఏమైనా గతంలో ‘పద్మావత్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను ఏలిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం ఒకవైపు ఇండస్ట్రీ నుండి నిషేదం , మరోవైపు దైవ నింద ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి ఈ కాంట్రవర్సీల నుండి రణ్‌వీర్ ఎలా బయటపడతాడో !
రణ్‌వీర్ సింగ్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఆయన కెరీర్‌కు ఒక పెద్ద సవాలు. న్యాయపరమైన చిక్కులు, ఇండస్ట్రీ బ్యాన్ వంటివి ఆయన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. ఈ పరిణామాలు బాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి.


