|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్లి చేసుకో అంటూ నెటిజన్ కామెంట్.. రష్మి గౌతమ్ అదిరిపోయే రిప్లై!

Published: 02-03-2026, 6:05 AM
షాకింగ్: పెళ్లి చేసుకో అంటూ నెటిజన్ కామెంట్.. రష్మి గౌతమ్ అదిరిపోయే రిప్లై!
  • నెటిజన్‌కు రష్మి కౌంటర్: ‘నేను రాడికల్ దేశంలో లేను, 9 ఏళ్లకే పెళ్లిళ్లు’
  • జనాభా పెరుగుదలపై రష్మి ఆందోళన: కండోమ్స్ వాడమని ప్రజలకు సూచన!
  • ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో రష్మి ఘాటు వ్యాఖ్యలు, దుమారం రేపిన పోస్ట్
  • యుద్ధం ఎవరికీ మంచిది కాదు, వివాదాలకు దూరంగా ఉండాలన్న రష్మి గౌతమ్

యాంకర్ రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. నెటిజన్ చేసిన కామెంట్‌కు ఆమె ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!

నెటిజన్‌కు రష్మి స్ట్రాంగ్ కౌంటర్

యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. జంతు ప్రేమికురాలు అయిన రష్మి వాటి రక్షణ కోసం, వాటి మనుగడ కోసం పోరాడుతుంది. కుక్కలు, ఆవులు, గేదెలు ఇలా ఏది ఇబ్బంది పడినా తాను చలించిపోతుంది. ఇటీవల రేణు దేశాయ్‌తో కలిసి ఆమె డాగ్స్ కోసం పోరాడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె వరుసగా ఛాట్‌ చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి చేస్తున్న నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందారు. దీంతో మన భారతీయులు ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు.

భారతీయ ముస్లీంలు రోడ్డుమీదకు వచ్చిన నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని ఉద్దేశించి ఘాటైన పోస్ట్ పెట్టింది రష్మి గౌతమ్‌. వారిని ఇరాన్‌ పంపించాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేసింది. అక్కడికి వెళ్లి ఇరాన్‌ తరఫున పోరాటం చేస్తారని సెటైర్లు వేశారు. ఇరాన్‌ కి సపోర్ట్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇచ్చింది. ఈ క్రమంలో యుద్ధం సరైనది కాదని, అది ఎవరికీ ప్రయోజనం చేయదని తెలిపింది రష్మి గౌతమ్‌.

జనాభాపై రష్మి ఆందోళన

ఈ క్రమంలో ఓ నెటిజన్‌ రష్మిని ఉద్దేశించి షాకింగ్‌ పోస్ట్ పెట్టాడు. నువ్వు పెళ్లి చేసుకుని, ప్రేమలో పడాలి. ఒంటరిగా జీవించడం వల్ల మిగతా మతాలన్నింటినీ ద్వేషించేలా చేస్తున్నావు అని ఓ నెటిజన్ కామెంట్‌ పెట్టాడు. దీనికి రష్మి స్పందించింది. `నేను రాడికల్‌ మనస్తత్వం ఉన్న దేశంలో నివసించడం లేదు. అక్కడ అమ్మాయిలు 9ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు. నేను అవివాహితురాలిని కావచ్చు,  పిల్లలు లేకుండా కూడా ఉండగలను. ఇప్పటికీ నా దేశంలో గౌరవం, వ్యక్తిత్వంతో జీవిస్తున్నాను` అని కౌంటర్‌ ఇచ్చింది రష్మి.

దీనికి ఆ నెటిజన్ స్పందిస్తూ, మీరు పెళ్లి చేసుకోకపోవచ్చు, లైంగిక బంధాన్ని పెట్టుకోకపోవచ్చు, పిల్లల్ని కనకుండా ఉండకపోవడం, ఇతర మతాలపై ద్వేషాన్ని చిమ్మే బదులు మీ జీవితంలో ఆనందాన్ని నింపే సహవాసం ఉండటం అనేది మీ అంతర్లీన సమస్యను పరిష్కరించుకోవాలి అని తిరిగి కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి రష్మి రియాక్ట్ అయ్యింది. మన దేశంలో జనాభాా బెంచ్‌ మార్క్ దాటిపోతుంది. మీరు ప్రజలను కండోమ్‌లు వాడాలని చెప్పాలి. మొత్తం క్రికెట్‌ జట్టుని పునరుత్పత్తి చేయకుండా ఉండటానికి ఆపరేషన్‌ చేయమని భోధించవచ్చు. మేం టాక్స్ పే చేస్తున్నాము, నా జీవితంలో నాకు కంపెనీ ఉందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. మీరు ఊహించవచ్చు అని తెలిపింది రష్మి గౌతమ్‌.

సోషల్ మీడియాలో దుమారం రేపిన రష్మి పోస్ట్

రష్మి గౌతమ్‌ వరసగా ఛాట్‌ చేస్తూ విరుచుకుపడుతుంది. బోల్డ్ కామెంట్లో రెచ్చిపోతుంది. తనని విమర్శించిన వారిని అదే స్థాయిలో దిమ్మతిరిగే కౌంటర్లిస్తుంది. ఇక జబర్దస్త్ యాంకర్‌గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. గత 13ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది రష్మి.

రష్మి గౌతమ్ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.