
📌 Key Points
- రష్మి గౌతమ్ పెళ్లిపై తాజా అప్‌డేట్, వచ్చే ఏడాది ఆగస్ట్‌లో వివాహం అని జ్యోతిష్యుడు వెల్లడి.
- ఆమె మనసులో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుందని జ్యోతిష్యుడు తెలిపాడు.
- సుడిగాలి సుధీర్‌తో రష్మి గత లవ్ ట్రాక్, ప్రస్తుతం వారి దూరంపై చర్చ.
- జ్యోతిష్యుడు చెప్పినదానిలో చాలా వరకు నిజం ఉందని రష్మి స్వయంగా ధృవీకరించింది.
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పెళ్లిపై సంచలన అప్‌డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఆమె కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పాడు. తన పెళ్లిపై రష్మి కూడా స్పందిస్తూ, జ్యోతిష్యుడు చెప్పినది చాలావరకు నిజమని ధృవీకరించింది. దీంతో పెళ్లి వార్త వైరల్‌గా మారింది.
రష్మి-సుధీర్ లవ్ ట్రాక్: కథేంటి?
జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయిన రష్మి గౌతమ్ ప్రస్తుతం `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో ఆమెకి విశేషమైన గుర్తింపుని, ఫాలోయింగ్‌ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో రష్మికి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. అయితే దీనికి మరో కారణం కూడా ఉంది. ఆమె సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడిపించడమే. `జబర్దస్త్` షోలో సుధీర్, రష్మి కలిసి చేసిన స్కిట్లు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా లవ్ స్కిట్లు, డ్యూయెట్ స్కిట్లు విశేషంగా ఆదరణ పొందాయి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచాయి.
దీంతో సుధీర్, రష్మి నిజంగానే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అభిమానులు కూడా అదే భావించారు. కానీ అనూహ్యంగా రెండేళ్ల నుంచి వీరిద్దరు దూరమయ్యారు. సుధీర్.. జబర్దస్త్ షోని వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రష్మి, సుధీర్ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలవలేదు. అయితే చాలా అరుదుగానే ఈ ఇద్దరు కలుస్తూ తమ రిలేషన్‌ని చాటి చెబుతున్నారు.
పెళ్లిపై జ్యోతిష్యుడి సంచలన అంచనా
ఇదిలా ఉంటే నలభై ఏళ్లకి దగ్గరగా ఉన్నా రష్మి గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు. ఈ క్రమంలో క్లారిటీ వచ్చింది. పెళ్లికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. టైమ్ కూడా ఫిక్స్ అయ్యిందట. తాజాగా ఆస్ట్రాలజర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్మి గౌతమ్ వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని, ఆమె జీవితంలో పెళ్లి యోగం ఉందని తెలిపారు. మనసులో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుందని తెలిపాడు. రష్మి జీవితంలోకి పెళ్లి గాలి సోకిందని, ఆ గాలి బలంగా వీస్తుందని తెలిపారు.
రష్మి గౌతమ్ రియాక్షన్: ఆమె ఏమన్నారు?
మరి ఆ గాలి సుడిగాలినా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి రష్మి కూడా స్పందించింది. ఆస్ట్రాలజర్ చెప్పినదాంట్లో చాలా వరకు నిజం ఉందని తెలిపింది. రష్మి కూడా నిజమే అని చెప్పిందంటే వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని చెప్పొచ్చు. ఆమె చేసుకోబోయేది సుధీర్ నా? లేక మరో వ్యక్తిని ప్రేమిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఒక ఆస్ట్రాలజర్ పాల్గొన్నాడు. ఇందులోనే యాంకర్ రష్మి గౌతమ్ జాతకం చెప్పాడు.
రష్మి గౌతమ్ పెళ్లి వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె జీవితంలోకి కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అయితే, ఆమె మనసు దోచిన ఆ వ్యక్తి సుడిగాలి సుధీరా, లేక మరొకరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


