|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారియర్‌గా ‘రష్మిక మందన్నా’.. ‘మైసా’ సినిమా ప్రకటన

Published: 27-06-2025, 5:03 AM
వారియర్‌గా 'రష్మిక మందన్నా'.. 'మైసా' సినిమా ప్రకటన

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా కొత్త సినిమా ‘మైసా’ను ప్రకటించింది. వారియర్‌గా కనిపించనున్న రష్మిక, ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

Key Points

1

రష్మిక మందన్నా కొత్త సినిమా 'మైసా' ప్రకటన

2

వారియర్‌గా రష్మిక మందన్నా కనిపించనున్నారు

4

భారీ బడ్జెట్‌తో అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మాణం

రష్మిక మందన్నా కొత్త అవతారం

2018లో “ఛలో” తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్‌, ఛావా సినిమాలతో పాటు రీసెంట్‌గా ‘కుబేర’తో  బాక్సాఫీస్‌ వద్ద  మెప్పించారు.  కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్‌ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్‌ ఆప్షన్‌గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో ‘మైసా’ అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్‌తో ప్రకటించారు.

అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో ‘మైసా’ కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్‌ను రష్మిక షేర్‌ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో  ఒక వారియర్‌గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో  ప్రకటించనున్నారు.

‘మైసా’ సినిమా విశేషాలు

పాన్ ఇండియా సినిమా ప్రయాణం

రష్మిక మందన్నా ‘మైసా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.