
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది!
- రష్మిక కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్
- విజయ్ తన మేడలో తాళికడుతుంటే భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు
- ‘నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం’ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల గురించి ఒక సంచలన వార్త! వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మికల పెళ్లి ఫోటోలు వైరల్!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. వీరి పెళ్లి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలను అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక.. కారణం ఇదే!
అయితే, ఆ ఫోటోలలో ఒక ఫోటో మాత్రం నెటిజన్స్ చూపులను ఆకర్షించింది. ఆ ఫోటో ఏంటంటే, రష్మిక(Rashmika Mandanna) కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో. అవును, తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు తనవాడు అవుతున్నాడన్న సంతోషంతో రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. విజయ్ తన మేడలో తాళికడుతున్న వేల భావోద్వేగాన్ని ఆపుకోలేని రష్మిక కంటనీరు పెట్టుకుంది.ఆ ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ రష్మిక విజయ్ ని అంతలా ప్రేమించిందా అంటూ చేస్తున్నారు. ఆ కన్నీళ్లు చూస్తేనే అర్థం అవుతోంది ఆమె ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది అని అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక మందన్న
ఇక ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోపక్క ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మిక. ఇప్పుడు నేను మీకు నా భర్తను పరిచయం చేస్తాను. అంతనే విజయ్ దేవదకొండ. నీ లాంటి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నా ప్రతీ ఎమోషన్ లో నువ్వు నాతో ఉన్నావు. నీ భార్యగా ఉండేందుకు నేను చాలా ఆతృతగా ఉన్నాను’అంటూ రాసుకొచ్చింది. దీంతో, రష్మిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
రష్మిక, విజయ్ ల పెళ్లి వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. వారి కొత్త జీవితం ఆనందంగా సాగాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


