|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna : ఇక నుంచి రష్మిక ఫ్యాన్స్ అదే సెంట్ వాడతారేమో.. ఎట్టకేలకు మొదలుపెట్టిందిగా..

Published: 22-07-2025, 6:19 AM
Rashmika Mandanna : ఇక నుంచి రష్మిక ఫ్యాన్స్ అదే సెంట్ వాడతారేమో.. ఎట్టకేలకు మొదలుపెట్టిందిగా..

ప్రముఖ నటి రష్మిక మందన్న తన పేరుతో పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ‘డియర్ డైరీ’ పేరుతో వచ్చిన ఈ పెర్ఫ్యూమ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రష్మిక ఈ ప్రాజెక్ట్ గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Key Points

1

రష్మిక మందన్న తన స్వంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'డియర్ డైరీ'ని ప్రారంభించింది.

2

నాలుగు వేరియంట్లలో 100ml మరియు 10ml పరిమాణాలలో పెర్ఫ్యూమ్ అందుబాటులో ఉంది.

4

రష్మిక ఈ పెర్ఫ్యూమ్‌ను తన జీవితానికి చాలా దగ్గరగా భావిస్తుందని తెలిపింది.

రష్మిక మందన్న ‘డియర్ డైరీ’ పెర్ఫ్యూమ్ లాంచ్

Rashmika Mandanna : సినిమా స్టార్స్ అంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. ఓ పక్క సినిమాలతో సంపాదిస్తూనే ఆ స్టార్ డమ్ తో బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు, యాడ్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరు హీరోలు, హీరోయిన్స్ ఇదే పని చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి హీరో, హీరోయిన్స్ కి సినిమా కాకుండా పక్కన ఏదో ఒక బిజినెస్ కూడా ఉంది. ఈ కోవలోకి ఇప్పుడు రష్మిక మందన్న చేరింది.

రష్మిక మందన్న పెర్ఫ్యూమ్ బిజినెస్ మొదలుపెట్టింది. డియర్ డైరీ అనే పేరుతో ఈ పెర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇందులో నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని కూడా 100ml, 10ml లో దొరుకుతున్నాయి. 100ml కాస్ట్ 2599 కాగా 10ml కాస్ట్ 599 రూపాయలుగా ఉంది. ప్రస్తుతానికి ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి. త్వరలో బయట షాప్స్ లోకి అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.

నాలుగు రకాల సువాసనలు అందుబాటులో

ఇక తన డియర్ డైరీ సెంట్ బిజినెస్ గురించి ఓ వీడియోని షేర్ చేసి.. ఇది నా మనసుకు చాలా దగ్గరైంది. ఇది కేవలం బ్రాండ్ మాత్రమే కాదు, ఇది కేవలం సెంట్ మాత్రమే కాదు నాలో ఒక భాగం. సెంట్ నా జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవాళ నేను దీని గురించి మీతో పంచుకుంటున్నాను. నేను సంతోషంతో పాటు భయంగా కూడా ఉంది. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు రష్మిక కూడా బిజినెస్ మొదలుపెట్టిందని, తన స్టార్ డమ్ తో ఆ సెంట్ బిజినెస్ బాగానే అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభం

రష్మిక మందన్న పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం తన అభిమానులను ఉత్సాహపరిచింది. ‘డియర్ డైరీ’ పెర్ఫ్యూమ్ విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.