
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘కుబేరుడు’ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రత్యేకమైనదని, ఇదివరకు చేయని రకమైన పాత్ర అని ఆమె తెలిపింది.
Key Points
రష్మిక మందన్న తన కొత్త సినిమా 'కుబేరుడు' గురించి మాట్లాడింది.
ఈ సినిమాలో ఆమె ఇంతకు ముందు ఎన్నడూ చేయని పాత్రలో నటించింది.
'కుబేరుడు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో కనెక్ట్ అవుతుంది.
రష్మిక మందన్న కొత్త సినిమా ‘కుబేరుడు’
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. సినీ చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఈ గుర్తింపు సొంతం సొంతం కావడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన, అందం, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.
తర్వాత వారసుడు, VNR Trio, ఆడవాళ్లు మీకు జోహార్లు,పొగరు, సుల్తాన్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, గీతా… ఛలో, గీత గోవిందం, దేవదాస్, కిరాక్ పార్టీ..వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసింది. ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో సుకుమార్ దర్శకత్వం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. తన ప్రదర్శన కనబర్చింది. మొదటి పార్ట్లో ప్రియురాలిగా.. సెకండ్ భాగంలో అల్లు అర్జున్ కు భార్యగా అద్భుతంగా నటించి జనాల్ని మెప్పించింది.
‘కుబేరుడు’ లో రష్మిక పాత్ర ప్రత్యేకత
అలాగే చావా చిత్రంతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మహారాణి పాత్రలో నటించింది. ఆకట్టుకునే చీరకట్టు, బొట్టు విధానంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ -సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలు.. లేటెస్ట్ ఫొటో షూట్లు, వెకేషన్స్ కు సంబంధించినవి అభిమానులతో పంచుకుంటుంది. ఇక రష్మిక నటించిన కుబేర చిత్రం మరో మూడ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
రష్మిక సోషల్ మీడియా అప్‌డేట్స్
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు టీజర్లు, టైలర్స్ విడుదల చేయగా.. నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ నేషనల్ క్రష్ నెట్టింట కుబేర టీజర్ పంచుకుని.. ‘‘కుబేరుడు చాలా విధాలుగా ప్రత్యేకమైనవాడు. ఒక నటిగా నేను ఏదైనా భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇది అలాంటి ఒక ప్రాజెక్టే. మీరు కుబేర ప్రపంచాన్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది నేను వ్యక్తిగతంగా ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పని.. కాబట్టి వేళ్లు దాటాయి’’ అంటూ నటి రాసుకొచ్చింది. instagram link
చివరగా, రష్మిక మందన్న ‘కుబేరుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా ఆమె నటనా జీవితంలో ఒక మలుపు అవుతుందని భావిస్తున్నారు.


