
📌 Key Points
- రష్మిక మందన్న బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
- విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుందని సమాచారం.
- పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
- షాహిద్ కపూర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ రష్మిక తిరస్కరించారు.
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న బాలీవుడ్ సినిమాకు నో చెప్పడంతో ఆమె కెరీర్ గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరగనుందనే వార్తలు నేపథ్యంలో, రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన రష్మిక
Rashmika Mandanna: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈమె పుష్ప సినిమాలో నటించడం, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో తదుపరి పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటున్నారు. ఇలా ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక కెరియర్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రైస్తవున్న ఈమె సినిమాలకు దూరం కావడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.
రష్మిక గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈమె మరొక నాలుగు రోజులలో మరొక నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఏడడుగులు నడవబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతోంది ఇలా పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు దూరంగా ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక ఒక బాలీవుడ్ సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వటం లేదట.
విజయ్ దేవరకొండతో పెళ్లి నిజమేనా?
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సినిమాలో రష్మికకు నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమా కథను రష్మికకు చెప్పినప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ సినిమాలను రష్మిక రిజెక్ట్ చేయడంతో పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారా లేకుంటే సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ తో పెళ్లి తర్వాత రష్మిక కొంత సమయాన్ని గడపడం కోసమే ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.
మరోసారి జంటగా విజయ్ రష్మిక..
సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా?
మరి నిజంగానే రష్మిక పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఈమె పలు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇక పెళ్లి కోసం రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా తమ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ రణబాలి అనే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారు.
రష్మిక పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. తదుపరి ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.

