|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక మందన్న:‘నాకు చాలా సంతోషంగా ఉంది.. కానీ దయచేసి అలా చేయండి’ అంటూ రష్మిక మందన్న పోస్ట్..

Published: 18-06-2025, 11:44 AM
రష్మిక మందన్న:‘నాకు చాలా సంతోషంగా ఉంది.. కానీ దయచేసి అలా చేయండి’ అంటూ రష్మిక మందన్న పోస్ట్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆమె అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటూ, ఒకరినొకరు దయతో ఉండాలని కోరింది. ‘కుబేర’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక…

Key Points

1

రష్మిక మందన్న తన సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

2

ప్రేక్షకులతో సంతోషాన్ని పంచుకుంటూ, ఒకరినొకరు దయతో ఉండాలని కోరారు.

4

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

రష్మిక మందన్న సోషల్ మీడియా పోస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో తెలియదు.. కానీ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతుంది. ఒకేసారి రెండు, మూడు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుంది. దాదాపు రష్మిక మందన్న నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నవే.

కుబేర సినిమా ప్రమోషన్స్

అయితే ఈ బ్యూటీ తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ‘మీ చుట్టూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ నన్ను నేను పునరావృతం చేసుకుంటున్నానని నాకు తెలుసు కానీ నేను ఆ రోజు చెప్పినట్లుగా.. మనతో ఇంకా ఎంత సమయం ఉందో మనకు తెలియదు, సమయం ఎంతుంటుందో.. మనం భవిష్యత్తు ఊహించలేము.. కాబట్టి దయచేసి ఒకరికొకరు దయగా ఉండండి, మీ పట్ల దయగా ఉండండి.

అభిమానుల ఆశలు

మీకు అత్యంత ముఖ్యమైన పనులు చేయండి’. అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ పిక్స్ పంచుకుంది. రష్మిక మరో రెండ్రోజుల్లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అండ్ ధనుష్ కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అభిమానుల అంచనా. కుబేర కూడా మంచి టాక్ సొంతం చేసుకుంటే ఇక రష్మికకు సినీ ఇండస్ట్రీలో తిరుగేలేదని చెప్పుకోవచ్చు.

రష్మిక మందన్న త్వరలో విడుదల కానున్న ‘కుబేర’ సినిమాపై అభిమానుల్లో ఎన్నో ఆశలున్నాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.