
📌 Key Points
- నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాటూ రహస్యం లీక్!
- ‘ఇర్రీప్లేసబుల్’ టాటూ వెనుక కాలేజీ సంఘటన!
- విజయ్ దేవరకొండతో సంబంధం లేదని క్లారిటీ!
- ఆడపిల్లల శక్తిని నిరూపించేందుకే టాటూ!
టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్న గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది! ఆమె చేతిపై ఉన్న టాటూ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? విజయ్ దేవరకొండ కోసమే వేయించుకుందా? పూర్తి నిజాలు తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే!
రష్మిక టాటూ వెనుక అసలు కథ ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నవరుస విజయాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన రష్మిక.. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. నటనతో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది రష్మిక. విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి, వేణు స్వామితో హోమాలు చేయించడం లాంటి విషయాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది బ్యూటీ. ఇక తాజాగా మరో విషయంలో రష్మిక మందన్నపై పెద్ద రచ్చ జరుగుతోంది.
రష్మిక మందన్న చేతిపై ఓ టాటు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆమె కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ అనే టాటూ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ టాటూను తన భర్త, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ టాటూ వెనుకు అసలు విషయం వేరే ఉంది. దీని గురించి ఆమె రీసెంట్ గా ఓ విషయాన్ని పంచుకుంది.
విజయ్ దేవరకొండతో సంబంధం లేదా?
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, ఈ టాటూ వెనుక ఉన్న అసలైన నిజాన్ని బయటపెట్టి అన్ని పుకార్లకు చెక్ పెట్టారు. రష్మిక మాట్లాడుతూ.. ” నాకు మొదట్లో అసలు టాటూ వేయించుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది.
ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి నాతో మాట్లాడుతూ ఆడపిల్లలు నొప్పిని అస్సలు భరించలేరని, వారికి సూదులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయమని ఎగతాళి చేశాడు. ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆడవాళ్లు ఎంతటి నొప్పినైనా భరించగలరని నిరూపించాలనే ఉద్దేశంతోనే టాటూ వేయించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని ఆమె అన్నారు.
ఆ అవమానమే టాటూకు కారణమా?
రష్మిక మాట్లాడుతూ.. ”టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, చేతిపై ఏ పదం రాయించుకోవాలనే విషయంలో చాలా ఆలోచించాను. నా జీవితంలో ఎప్పుడూ సహజంగా, నిజాయితీగా ఉండాలని కోరుకునే వ్యక్తిని, . ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రత్యేకమే.. ఎవ్వరినీ మరొకరు భర్తీ చేయలేరనే భావన నాకు ఎంతో బలంగా ఉంది. ఆ ఆలోచన ప్రతిరోజూ నాకు నేను గుర్తు చేసుకునేందుకు ‘ఇర్రీప్లేసబుల్’ అనే పదాన్ని టాటూగా ఎంచుకున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు.
రష్మిక టాటూ వెనుక ఉన్న ఈ ఆసక్తికర నిజం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. మరిన్ని సంచలనాత్మక టాలీవుడ్ వార్తల కోసం మా ఛానెల్‌ని చూస్తూనే ఉండండి!


