
రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆమె నటించిన హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘థామా’ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
రష్మిక మందన్న నటించిన నాలుగో సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఆమె లేటెస్ట్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ పేరు 'థామా'.
రష్మిక మనుషుల రక్తాన్ని తాగే బేతాళి రాక్షసిగా నటించింది.
ఆయుష్మాన్ ఖురానా కూడా బేతాళుడిగా ఈ సినిమాలో కనిపిస్తారు.
రష్మిక 100 కోట్ల హిట్ థ్రిల్లర్
వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసిన నాలుగో సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేద్దాం.
‘థామా’ సినిమా కథేంటి?
ఒక దాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ, బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది రష్మిక మందన్న. ఆమె నటించిన లేటెస్ట్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘థామా’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సినిమాలో రష్మిక మందన్న మనుషుల రక్తాన్ని తాగే బేతాళి జాతికి చెందిన రాక్షసిగా నటించింది. ఆయుష్మాన్ ఖురానా కూడా బేతాళుడగా మారతాడు. ఈ ఇద్దరికీ లవ్ కుదురుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ బేతాళ కథ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
రష్మిక ‘థామా’తో మరో బ్లాక్‌బస్టర్‌ను సాధించింది. రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. స్ట్రీమింగ్ వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


