
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల నిశ్చితార్థంపై వార్తలు వైరల్ అవుతున్న వేళ, పిల్లల ప్లానింగ్ గురించి రష్మిక చేసిన షాకింగ్ కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలు వారి నిశ్చితార్థం నిజమేననే చర్చకు దారితీస్తున్నాయి.
Key Points
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం వార్తలు వైరల్ అవుతున్నాయి.
పిల్లల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నానని రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది.
భవిష్యత్ పిల్లల కోసం ఫిట్‌గా ఉండాలని, పనిగంటలు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.
రష్మిక వ్యాఖ్యలు విజయ్‌తో ఆమె నిశ్చితార్థం నిజమేనని చర్చకు దారితీశాయి.
రష్మిక-విజయ్ నిశ్చితార్థంపై ఊహాగానాలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే తెలుగు వారింటికి కోడలుగా వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఈ విషయంపై ఈ జంట ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. అయినప్పటికీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు, పెళ్లికి సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ఈ విషయంపై రష్మికకు ప్రశ్న ఎదురవగా.. మీకు తెలియాల్సినప్పుడే తెలుస్తుంది.. నేను కూడా త్వరలో ప్రకటిస్తానంటూ షాకిచ్చింది.
పిల్లల ప్లానింగ్ గురించి రష్మిక కామెంట్స్
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇప్పటి నుంచే పిల్లల కోసం కనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించి అందరికీ షాకిచ్చింది. ‘‘నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారి కోసం నేను ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. సురక్షితంగా ఉండాలని వారికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. అందుకే పనిగంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదు.
రష్మిక వ్యాఖ్యలతో పెరిగిన చర్చ
మాకూడా ఇప్పటినుంచి ఫిక్స్‌డు టైమింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మిగతా టైమ్ ఫ్యామిలీతో, హెల్త్‌కి కేటీయించాలనుకుంటున్నాను. అలాగే ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా విజయ్‌తో నిశ్చితార్థం జరగడం నిజమే అని వాదిస్తున్నారు. ఈ కామెంట్స్‌తో రష్మిక హింట్ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె నిశ్చితార్థం వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. భవిష్యత్తుపై ఆమెకు ఉన్న ప్రణాళికలు, పిల్లల కోసం ఇప్పటి నుంచే ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.


