|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక-విజయ్ ప్రేమకథకు శుభం కార్డు: డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడో తెలుసా? తేదీ ఫిక్స్!

Published: 29-12-2025, 10:32 PM
రష్మిక-విజయ్ ప్రేమకథకు శుభం కార్డు: డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడో తెలుసా? తేదీ ఫిక్స్!
  • రష్మిక-విజయ్ దేవరకొండ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలున్నాయి.
  • అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చినా, అధికారిక ప్రకటన లేదు.
  • ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం.
  • ఈ పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరుగుతుందని టాక్.

టాలీవుడ్ తారలు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ప్రేమాయణంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా, వీరి పెళ్లి తేదీ, వేదిక ఫిక్స్ అయినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిరాడంబరంగా పెళ్లి జరగనుందని టాక్.

రష్మిక-విజయ్ ప్రేమాయణం: నిశ్చితార్థం రూమర్లు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజులుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించడం లేదు. ఇక ఇటీవల వీరిద్దరు తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి అక్టోబర్‌లో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ గురించి రష్మిక, విజయ్ ఎక్కడా మాట్లాగలేదు. అలాగే అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే రష్మిక చేతి రింగ్‌తో నిశ్చితార్ధం పుకార్లు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ జంట మాత్రం పెళ్లిపై ఎలాంటి హింట్ ఇవ్వడం లేదు.

ఇద్దరు సైలెంట్‌గా ఉంటూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈక్రమంలో.. తాజాగా, విజయ్, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్‌లోని అందమైన ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ దేవరకొండ ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే గతంలో కూడా ఇలాంటి పెళ్లి డేట్ వార్తలు చాలాసార్లు వచ్చి, అవననీ రూమర్లగానే మిగిలిపోయాయి. ఇక ఈ సారి కూడా అలాగే జరుగుతుందని కొందరు అంటేంటే.. మరికొందరు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చర్చించుకుంటున్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్: వేదిక, డేట్ ఫిక్స్!

గతంలోనూ పుకార్లేనా? నిజమెంత?

రష్మిక-విజయ్ పెళ్లి వార్తలు గతంలోనూ వచ్చినా, ఈసారి డేట్, వేదికతో సహా వివరాలు బయటపడటంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.