|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విరోష్ పెళ్లి వేడుక: ఉదయ్‌పూర్‌లో తారల సందడి! ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ ఒక్కటవుతున్న వేళ!

Published: 24-02-2026, 1:05 PM
విరోష్ పెళ్లి వేడుక: ఉదయ్‌పూర్‌లో తారల సందడి! ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ ఒక్కటవుతున్న వేళ!
  • ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం
  • ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు వేడుకలు
  • కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం
  • పెళ్లికి హాజరైన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా

టాలీవుడ్ ప్రేమ జంట రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విరోష్ పెళ్లి వేడుకలు

Virosh Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైంది. రష్మిక విజయ్ దేవరకొండతో పాటు అల్లు శిరీష్ కూడా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే . రష్మిక విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలు ఉదయ్ పూర్ లోఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులు పాటు వీరి వివాహకు వేడుకలు జరుగనున్నాయి. ఈ వివాహపు వేడుక కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగబోతోంది. ఈ వివాహపు వేడుకలో భాగంగా అతి తక్కువ మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.

ఇలా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker), ఈషా రెబ్బా(Eesha Rebba), ఉదయ్ పూర్ చేరుకున్న సంగతి తెలిసిందే . వీరితోపాటు నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) కూడా వీరి పెళ్లి వేడుకల కోసం ఉదయ్ పూర్(Udaipur) చేరుకున్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో సందడి చేస్తున్నారు. ఇలా విజయ్ దేవరకొండ రష్మికకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనబోతున్నారు.

హాజరైన టాలీవుడ్ సెలెబ్రిటీలు

ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలలో భాగంగా పాల్గొనబోయి అతిథిలకు సంబంధించిన జాబితా కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అల్లు అర్జున్ తో పాటు సందీప్ రెడ్డి సుకుమార్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కీలకమైన వారు హాజరుకాబోతున్న నేపథ్యంలో విజయ్ రష్మిక ఇంటర్నేషనల్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది.

రోజుకు రూ.2 కోట్లు ఖర్చు..

వివాహ వేడుకలో భారీ భద్రత

ఈ పెళ్లి పేరుకులో కేవలం సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇక వివాహ రిసెప్షన్ లో భాగంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఉదయ్ పూర్ లో ఈ వివాహం ఐటిసి మెమెంటోస్ అనే రిసార్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఆరావలి పర్వతాల నడుమ ఈ రిసార్ట్ ఎంతో అందంగా, విలాసవంతంగా అన్ని సౌకర్యాలతో ఉంది. ఈ రిసార్ట్ కోసం విజయ్ దేవరకొండ రష్మిక భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారని కేవలం రిసార్ట్ కోసమే ఈ జంట రోజుకు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్క వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

మొత్తానికి రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి వేడుకలు ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి. అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.