
📌 Key Points
- ఉదయపూర్ లో హిందూ, కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్న విజయ్, రష్మిక.
- తమ సొంత గ్రామంలో నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసిన దంపతులు.
- గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తానని విజయ్ ప్రకటన.
- సంగీత్ వేడుకలో రష్మిక, విజయ్ ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్.
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు. అనంతరం సొంత గ్రామంలో గృహప్రవేశం చేశారు. సంగీత్ వేడుకలో ఈ జంట సందడి చేయగా, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మికల వివాహ వేడుక
Rashmika -Vijay:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు . ఉదయపూర్ లో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం , సాయంత్రం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఈ జంట.. అనంతరం విజయ్ దేవరకొండ సొంత గ్రామమైన నాగూర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్ పేటలో తన భార్య రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలసి నూతన గృహప్రవేశం చేయడమే కాకుండా అందులో శ్రీ సత్యనారాయణ వ్రతం కూడా చేశారు.
అనంతరం గ్రామ ప్రజలకు పసందైన విందు ఏర్పాటుచేసిన విజయ్ దేవరకొండ అక్కడ బహిరంగంగా మాట్లాడుతూ తమ ఊరి అభివృద్ధి కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉండే 44 ప్రభుత్వ పాఠశాలలో 9 , 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు ఈ ఏడాది నుంచే స్కాలర్షిప్ అందజేస్తామని ప్రకటించారు. అంతేకాదు తరచూ గ్రామానికి వస్తామని, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand deverakonda)పెళ్లి కూడా తమ సొంత గ్రామంలోనే చేస్తామని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. గ్రామ ప్రజలు తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటామని చెప్పిన విజయ్ దేవరకొండ అభివృద్ధికి ఖచ్చితంగా బాటలు వేస్తామని స్పష్టం చేశారు.
ఇకపోతే ఫిబ్రవరి 26న ఘనంగా ఉదయ్ పూర్ లో వివాహం జరగగా.. అప్పటినుంచి తమ వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన్న ఇద్దరు ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివాహం రోజు తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను జంటగా పంచుకుంది విరోష్ జంట. అలా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో లేదో 12 గంటల్లోనే రెండున్నర కోటికి పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించారు.
సంగీత్ లో వినోదంగా విరోష్ జంట
ఇకపోతే వందమంది అత్యంత సన్నిహితులు బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి ముందు అనగా ఫిబ్రవరి 24న సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ తమ అధికారిక ఖాతాల ద్వారా పంచుకున్నారు. సిల్వర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన లెహంగాను రష్మిక ధరించగా.. బ్లాక్ సూట్ లో విజయ్ దేవరకొండ మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఇద్దరు కూడా తమ తమ వస్త్రధారణతో స్టైలిష్ లుక్కుతో తమ సంగీత వేడుకలను మరింత వినోదంగా మార్చేశారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వైరల్ అవుతున్న ఫోటోలు
ఇకపోతే విరోష్ జంట ఇటు సంగీత కార్యక్రమాలతోనే కాదు అటు “విరోష్ ప్రీమియర్ లీగ్” అంటూ తమ పెళ్ళికి వచ్చిన బంధువులు స్నేహితులతో క్రికెట్ కూడా ఆడారు.మరి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తరువాతి రోజుల్లో పంచుకుంటారేమో చూడాలి. మొత్తానికైతే ఈ సంగీత వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మరింత అందంగా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తమ వివాహ మహోత్సవం సందర్భంగా ప్రధాన నగరాలలో అన్నదానంతో పాటు స్వీట్స్ కూడా పంచిపెట్టారు.
Tags rashmika Manadanna Vijay Devarakonada Share
విజయ్, రష్మికల పెళ్లి వేడుక ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ జంట తమ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు.


