
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మొదటి హారర్ థ్రిల్లర్ ‘థామా’ షూటింగ్ ప్రయాణం గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. సినిమా కోసం పడిన కష్టాలు, అనుభవాలను గుర్తుచేసుకుంటూ, దర్శకుడు ఆదిత్య, చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది.
Key Points
రష్మిక మందన్న 'కిరీక్ పార్టీ'తో నేషనల్ క్రష్‌గా మారి, భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది.
ఆమె మొదటి హారర్ థ్రిల్లర్ 'థామా' అక్టోబర్ 21న విడుదలై పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది.
'థామా' షూటింగ్ జ్ఞాపకాలను రష్మిక గుర్తుచేసుకుని, పలు ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
దర్శకుడు ఆదిత్య, చిత్రబృందం అంకితభావం పట్ల రష్మిక ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.
రష్మిక ‘థామా’ సినీ ప్రయాణం
రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘కిరీక్ పార్టీ’తో వచ్చి నేషనల్ క్రష్‌గా మారి ఇండస్ట్రీనీ ఏలేస్తోంది. భాషతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ అందాల తార యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను తన నటన, అందంతో మెస్మరైజ్ చేసింది. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భామ మొదటిసారి హారర్ థ్రిల్లర్ ‘థామా’ (Thamma)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. తాజాగా, రష్మిక ‘థామా’ షూటింగ్ విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.
ఎమోషనల్ పోస్ట్‌లో రష్మిక మాటలు
పలు ఫొటోలు షేర్ చేస్తూ కీలక నోట్ విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ‘‘ఈ సినిమా ప్రయాణాన్ని ఎలా వివరించాలి. మొదటి రోజు నుంచి చివరిరోజు వరకు ప్రతీదీ నా మనసుకు హత్తుకున్నదే. వర్క్ చేయడమే కాదు.. భరోసా, నవ్వులు, గాయాలు, నిద్రలేవడానికి ఇష్టపడని ఉదయాల ఉన్నాయి. షూటింగ్ ముగించడానికి అంగీకరించని రాత్రులు ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దర్శకుడు ఆదిత్య(Aditya) నాపై నమ్మకంతో ‘థామా’ తెరకెక్కించారు. ప్రతి సీన్‌లో ఆయన అంకితభావం కనిపిస్తుంది. అలాగే ఈ మూవీ టీమ్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. చాలా కష్టపడి ఎంత్తైన కొండ ప్రదేశాలకు కూడా పరికరాలను కష్టం అనుకోకుండా మోసుకొచ్చి మాకు సహకరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టమంతా..ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ చూసి మర్చిపోతాం. ‘థామా’ విషయంలో అదే జరిగింది’’ అని రాసుకొచ్చింది.
దర్శకుడు, టీమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
మొత్తంగా, రష్మిక తన సినీ ప్రయాణంలో ప్రతీ సినిమాను ఎంతగా ప్రేమిస్తుందో ఈ పోస్ట్ స్పష్టం చేస్తుంది. ‘థామా’ విజయం పట్ల ఆమె ఆనందం, చిత్రబృందం పట్ల ఆమెకున్న కృతజ్ఞత అభినందనీయం.


