
📌 Key Points
- రవితేజకు హిట్ కోసం ఎదురుచూపులు, వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
- శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమా రూపొందుతోంది, ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా.
- జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమా కథ విని షాక్ అయ్యారట, ఇది రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటున్నారు.
- ‘ఇరుముడి’ ఒక కొత్త యాక్షన్ ఫార్ములాతో వస్తోంది, ఇది కమర్షియల్‌గా కూడా విజయం సాధిస్తుందని అంచనా.
మాస్ మహారాజా రవితేజ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన గత సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ పాజిటివ్ కామెంట్స్ చేశారు.
రవితేజకు హిట్ ఎంత అవసరం?
Irumudi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) కు అర్జెంట్‌గా హిట్ కావాలి. సంవత్సరం మొత్తం గ్యాప్ లేకుండా ఆయన సినిమాలు చేస్తుంటారు. కానీ, సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మళ్లీ ఒక్క సినిమా హిట్ పడితే.. ఇంకో 10 సినిమాల వరకు ఆయనకు తిరుగుండదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పని చేస్తూ, కార్మికులందరికీ పనితో బిజీగా ఉండేలా చేయడంలో రవితేజ పాత్ర ఎంతో ఉంటుంది. ఆయన చేసే సినిమాలలో ఎఫెర్ట్ పరంగా కూడా రవితేజ ఎక్కడా తగ్గరు. మొదటి నుంచి ఆయన సినిమాకు 100 శాతం ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. కానీ, కంటెంట్ విషయంలోనే ఆయన జడ్జిమెంట్ దారి తప్పుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాతో కచ్చితంగా హిట్ కొడతారని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) కూడా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
‘ఇరుముడి’ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారు?
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో స్టోరీ ఉండబోతుందని తెలుస్తోంది. అదే విషయాన్ని ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కూడా తెలియజేస్తోంది. తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేసిన కామెంట్స్ వింటే.. రవితేజ అభిమానులు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే, వారికి కొన్నాళ్లుగా నిద్రలేని రాత్రులే మిగిలాయి. కానీ, ఈసారి వచ్చే సినిమా మాత్రం వారికి చక్కని విందుని ఇస్తుందని, అంత అద్భతమైన స్టోరీ ఈ సినిమాకు కుదిరిందని, స్టోరీ విని షాకయ్యానని జీవీ ప్రకాష్ అన్నారు.
సినిమా విజయంపై అంచనాలు
‘‘నిజంగా అది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇటీవల నేను ఆ కథ విన్నాను.. చాలా టెర్రిఫిక్‌గా ఉంది. యాక్షన్ జోనర్‌లో ఇదొక కొత్త ఫార్ములా. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అడ్డంకులను దాటుకుని, రికార్డులను తిరగరాస్తుంది. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కథ విని నేను అంతగా ఎగ్జయిట్ అవడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ, ‘ఇరుముడి’ కథ నన్ను ఎంతగానో ఎగ్జయిట్ చేసింది. సంగీతం కూడా ఆ సినిమాకు అద్భుతంగా ఉంటుంది’’ అని జీవీ ప్రకాష్ కుమార్ తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే, రవితేజ అభిమానులు ఆయన మాటలకు ఫుల్ ఖుషి అవుతున్నారు. అన్నకి ఈసారి హిట్ వస్తుందని అప్పుడే ఫిక్స్ అవుతున్నారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
మొత్తానికి జీవీ ప్రకాష్ కుమార్ కామెంట్స్ రవితేజ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ‘ఇరుముడి’ సినిమా రవితేజ కెరీర్‌కు నిజంగానే ఒక మైలురాయి అవుతుందో లేదో చూడాలి.


