
📌 Key Points
- జగపతిబాబు ‘సీతా పయనం’ సినిమాలో నటించలేకపోయినందుకు అర్జున్, చిత్ర బృందానికి క్షమాపణలు తెలిపారు.
- బిజీ షెడ్యూల్ కారణంగానే సినిమాలో నటించలేకపోయానని జగపతిబాబు వివరించారు.
- అర్జున్, జగపతిబాబు గతంలో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాలో కలిసి నటించారు.
- జగపతిబాబు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
జగపతిబాబు సీనియర్ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ సినిమాలో నటించలేకపోయినందుకు చింతిస్తూ, చిత్ర బృందానికి క్షమాపణలు తెలిపారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ అవకాశం కోల్పోయానని తెలిపారు.
జగపతిబాబు క్షమాపణలకు కారణం
Jagapathi Babu: జగపతిబాబు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో విలన్ పాత్రలలోను సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన జగపతిబాబు (Jagapathi Babu)ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే ఈయన హీరోగా కంటే కూడా విలన్ పాత్రల ద్వారానే మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న జగపతిబాబు తాజాగా సీనియర్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja)తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అర్జున్ అలాగే సీతా పయనం(Seetha Payanam) చిత్ర బృందానికి క్షమాపణలు చెప్పారు.
అర్జున్ సర్జా హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర్య అర్జున్, నిరంజన్ ప్రధాన పాత్రలలో సీత పయనం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం జగపతిబాబుతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను మాట్లాడారు అయితే ముందుగా జగపతిబాబు సీతా పయనం చిత్ర బృందానికి క్షమాపణలు తెలియజేశారు. తాను ఈ సినిమాలో నటించాల్సి ఉండగా నటించలేకపోయానని అందుకే క్షమాపణలు చెబుతున్నానంటూ తెలియచేశారు.
అర్జున్ సర్జా స్పందన
ఈ విధంగా జగపతిబాబు క్షమాపణలు చెప్పడంతో వెంటనే అర్జున్ మీరు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చాలా బిజీ బిజీగా ఉన్నారు అందుకే చేయలేకపోయారని తెలిపారు. ఇక జగపతిబాబు మాత్రం రెండు కారణాలతో క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఒకటి అర్జున్ నీకోసం, మన లిటిల్ ప్రిన్సెస్ కోసం నేను ఈ సినిమా చేయాల్సి ఉండేది కానీ చేయలేకపోయాను కనీసం కథ కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ చూసి ఇంత మంచి సినిమాలో భాగం కాలేకపోయానని భావన కూడా నాలో ఉందని తెలిపారు.
పాన్ ఇండియా సినిమాలతో బిజీగా జగపతి బాబు..
జగపతిబాబు బిజీ షెడ్యూల్
ఇలా ఈ రెండు కారణాల వల్ల తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ జగపతిబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక జగపతిబాబు అర్జున్ మధ్య చాలా మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా వీరిద్దరూ హీరోలుగా కొనసాగే సమయంలో మంచి స్నేహితులు గా ఉన్నారనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో జగపతిబాబు ఏ పాత్రను రిజెక్ట్ చేశారు అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. జగపతిబాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు.
జగపతిబాబు క్షమాపణలు చెప్పడం, అర్జున్ దానిని స్వీకరించడం వారి మధ్య ఉన్న స్నేహ సంబంధాన్ని తెలియజేస్తుంది. వారిద్దరూ మళ్ళీ కలిసి పనిచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


