|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కులం పేరుతో నన్ను దూరం చేశారు.. మూడు సినిమాల్లో అవకాశం కోల్పోయా: రవికృష్ణ సంచలనం!

Published: 29-12-2025, 8:21 AM
కులం పేరుతో నన్ను దూరం చేశారు.. మూడు సినిమాల్లో అవకాశం కోల్పోయా: రవికృష్ణ సంచలనం!
  • నటుడు రవికృష్ణ తన కులం కారణంగా మూడు సినిమా ప్రాజెక్టుల నుంచి తొలగించబడినట్లు వెల్లడించారు.
  • ఆధార్, పాన్ కార్డులో సర్ నేమ్ చూసి నిర్మాతలు తన అవకాశాలను నిలిపివేశారని తెలిపారు.
  • పాఠశాల, కళాశాల దశ నుంచే కులం గురించి ఎదుర్కొన్న ప్రశ్నలను గుర్తుచేసుకున్నారు.
  • సినీ పరిశ్రమలో కుల వివక్షపై మాట్లాడటానికి చాలామంది భయపడతారని రవికృష్ణ అభిప్రాయపడ్డారు.

తెలుగు నటుడు రవికృష్ణ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కులం పేరుతో తనకు సినిమా అవకాశాలు దూరం అయ్యాయని, మూడు ప్రాజెక్టుల నుంచి తప్పించారని రవికృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కులం పేరుతో సినిమా అవకాశాలు దూరం

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికృష్ణ కులం సమస్య గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. (Ravikrishna)

Ravikrishna : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రవికృష్ణ బిగ్ బాస్ తో మరింత వైరల్ అయి ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల దండోరా సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రవికృష్ణ వేరే కులం అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఇతన్ని చంపేసే పాత్రలో నటించాడు.(Ravikrishna)

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికృష్ణ కులం సమస్య గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇండస్ట్రీలోనూ కుల వివక్ష: రవికృష్ణ

రవికృష్ణ మాట్లాడుతూ.. స్కూల్ లో, కాలేజీలో కూడా కులం గురించి మాట్లాడేవాళ్ళు. మీరేంటి అని అడిగేవాళ్ళు ఎక్కడికి వెళ్లినా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా కులం సమస్యల గురించి ఫేస్ చేశాను. కానీ దాని గురించి మాట్లాడలేదు. వేరే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో కులం రిలేటెడ్ సమస్యల గురించి మాట్లాడటానికి భయపడతారు, ఇంట్రెస్ట్ చూపించరు. నేను ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నా వాయిస్ రైజ్ చేసి మాట్లాడతాను దాని గురించి. ఇండస్ట్రీలో కూడా మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను.

రవికృష్ణ వ్యాఖ్యలపై నెటిజన్ల చర్చ

ఓ సారి అన్ని ఓకే అయ్యి అగ్రిమెంట్ చేసుకుంటప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వమంటే ఆధార్, పాన్ కార్డు పంపిస్తే దాంట్లో నా సర్ నేమ్ చూసి మీరు ఇదా అని మళ్ళీ చెప్తాము అని అన్నారు. అగ్రిమెంట్ అన్నారు కదా అని అడిగితే మాట్లాడి మళ్ళీ చెప్తాము అన్నారు. అలా ఒక మూడు నాలుగు సినిమాలు నా కులం చూసి ఆగిపోయాయి. సరే ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఓకే అన్నా కూడా కుదరదు అని ఏవో కారణాలు చెప్పి తప్పించారు. కులం సమస్యలు గట్టిగానే అనుభవించాను అని అన్నారు. దీంతో రవికృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అతని కులం ఏంటి అని వెతుకుతున్నారు నెటిజన్లు.

రవికృష్ణ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని కుల వివక్షపై మరోసారి చర్చకు దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆయన వ్యాఖ్యల పట్ల పలువురు మద్దతు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.