|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’: ఫుల్ ఫన్ రైడ్! మాస్ రాజా మాట ఇది!!

Published: 11-01-2026, 5:30 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి': ఫుల్ ఫన్ రైడ్! మాస్ రాజా మాట ఇది!!
  • రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ!
  • డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం!
  • జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’!
  • సునీల్ తో కలిసి దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నాం: రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా ఫుల్ ఫన్ రైడ్ అని ఆయన అన్నారు.

ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంటున్న రవితేజ!

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ…అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృద్వి ఇందులో ఎంటర్తినింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు. ఇందులో సునీల్ తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య కిషోర్ మురళీధర్ గారు గెటప్ శీను సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్ళతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ట్ శివ నిర్మాణంతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమ ప్రమోషన్స్ లో డాన్స్ ఇరగదీసారు. ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లో కలుద్దాం.

భీమ్స్ మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్ లో నా సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. మిరపకాయ వచ్చిన మిస్టర్ బచ్చన్ వచ్చిన ఒకేలా ఉండే వ్యక్తి మాస్మహారాజా రవితేజ. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారిలో తర్వాత రవితేజ గారిలో చూశాను. ఆయన డైరెక్టర్స్ గా పరిచయం చేసిన వాళ్ళందరూ ఈరోజు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. నాకు డైరెక్టర్ జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే. మళ్ళీ రవితేజ గారితో బ్లాక్ బస్టర్ తీస్తాను. అది నా ప్రామిస్. ఈ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూసిన వెంటనే బ్లాక్ బస్టర్ ఫీలింగ్ వచ్చింది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్. సినిమా కిషోర్ తిరుమల సెన్సిబుల్ డైరెక్టర్. తప్పకుండా ఈ సినిమా తనకి బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం జనవరి 11న మిరపకాయ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13న ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది.సంక్రాంతికి చాలా గట్టిగా కొడుతున్నాం.

జనవరి 13న థియేటర్లలో సందడి చేయనున్న మూవీ!

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… మాలాంటి ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యారంటే రవితేజ గారు పెట్టిన బిక్ష. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మమ్మల్ని డైరెక్టర్లు చేశారు. త్వరలోనే ఆయనతో సినిమా చేస్తాను. రవితేజ గారు ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్న సినిమాలు చేశారు. పవర్ సినిమా టైంలో డైరెక్టర్ కిషోర్ డైలాగ్స్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. కచ్చితంగా తన నిజాయితీ తన హార్డ్ వర్క్ ఈ సినిమాకి పే చేస్తుంది. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ అభినందనలు. ప్రసాద్ మూరెళ్ల రవితేజ గారిని చాలా అందంగా చూపించారు. బీమ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందని ఓ పర్సన్ చెప్పారు. ఆయనే చెబితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరికీ ఆల్ ది బెస్ట్.

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.