|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ రాజా రవితేజ ‘ఇరుముడి’తో దిమ్మతిరిగే లుక్! ఫస్ట్ గ్లింప్స్‌తోనే రికార్డులు షురూ!

Published: 26-01-2026, 3:35 PM
మాస్ రాజా రవితేజ 'ఇరుముడి'తో దిమ్మతిరిగే లుక్! ఫస్ట్ గ్లింప్స్‌తోనే రికార్డులు షురూ!
  • రవితేజ కెరీర్‌లో 77వ చిత్రం ‘ఇరుముడి’.. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణం!
  • అయ్యప్ప దీక్షలో రవితేజ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆధ్యాత్మిక శోభ, భక్తుల ఆనందోత్సాహాలు!
  • ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర కనిపించనుంది!
  • జివి ప్రకాష్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ.. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశం!

మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘ఇరుముడి’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

రవితేజ 77వ చిత్రం.. ‘ఇరుముడి’ టైటిల్ ఫిక్స్!

మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రం #RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టినరోజును సందర్భంగా, మేకర్స్ ఈరోజు ఈ చిత్రం టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు

ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌ ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఇది అయ్యప్ప స్వామి దీక్షని సూచిస్తోంది. అద్భుతమైన ఫస్ట్ లుక్‌లో రవితేజ సాంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపించారు. భక్తులతో నిండిన వేడుక ఊరేగింపులో, గొప్ప ఆనందోత్సాహాలతో కనిపించడం ఒక ట్రాన్స్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రవితేజ పాపని ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది, రవితేజకు మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవుతున్నారు.

అయ్యప్ప భక్తుడి అవతార్‌లో రవితేజ.. ఫస్ట్ లుక్ అదిరింది!

ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తండ్రీకూతుళ్ల అనుబంధం.. ఎమోషనల్ స్టోరీ లైన్!

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు రాశారు, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇరుముడి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

రవితేజ ‘ఇరుముడి’ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేసింది. శివ నిర్వాణ దర్శకత్వం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.