|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ RT-77: మాస్ జాతర షురూ! ఫస్ట్ లుక్ అప్డేట్ తో రికార్డుల వేట మొదలు!

Published: 25-01-2026, 2:05 AM
రవితేజ RT-77: మాస్ జాతర షురూ! ఫస్ట్ లుక్ అప్డేట్ తో రికార్డుల వేట మొదలు!
  • రవితేజ RT-77 మూవీ నుంచి బిగ్ అప్డేట్: ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
  • శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు.
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
  • జనవరి 26న ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

మాస్ మహారాజా రవితేజ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో RT-77 మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు వస్తున్నాడు. ఫస్ట్ లుక్ అప్డేట్తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

RT-77 నుంచి అదిరిపోయే అప్డేట్!

హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja). తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bharta Mahasayulaku Vignapthi) సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆయన ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘RT-77’(వర్కింగ్ టైటిల్). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఇక దీనికి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందట. తన రెగ్యులర్ లవ్ జానర్ వదిలి పెట్టి శివ నిర్వాణతో కొత్తగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ రాబోతున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

మాస్ రాజా రికార్డుల వేట షురూ!

ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘అతని విముక్తి ప్రయాణం రేపటి నుండి ప్రారంభమవుతుంది .. #RT77 ఫస్ట్ లుక్ 26.01.26న ఉదయం 10 గంటలకు రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ఎక్కడో సిటీకి దూరంగా ఓ నది ఒడ్డున ఉన్న చెట్టుకు దండం కట్టెసి బ్లాక్ కలర్ బట్టలు ఆరేసి ఉంది. చుట్టూ చీకటి, చాలా దూరంలో ఓ బ్రిడ్జి ఉన్నట్లు పోస్టర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RT-77 మూవీ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మాస్ రాజా రికార్డులు కొల్లగొట్టడం ఖాయం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.