|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RCB గెలిచాక ప్రపంచంలో అంతా విధ్వంసమే?.. మళ్లీ వివాదంలో సోనూ నిగమ్‌? నిజమెంత?

Published: 19-06-2025, 10:15 AM
RCB గెలిచాక ప్రపంచంలో అంతా విధ్వంసమే?.. మళ్లీ వివాదంలో సోనూ నిగమ్‌? నిజమెంత?

ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో సంబరాలు జరుగుతున్న సమయంలోనే, సోనూ నిగమ్ పేరుతో వివాదాస్పద ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్‌ వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

RCB ఐపీఎల్ ట్రోఫీ గెలుపు తర్వాత వివాదాస్పద ట్వీట్

2

సోనూ నిగమ్ పేరుతో ఉన్న ట్వీట్ నిజానికి బిహార్ లాయర్‌ది

4

కన్నడ ప్రజలతో క్షమాపణలు చెప్పిన సోనూ నిగమ్

RCB విజయం తర్వాత వివాదాస్పద ట్వీట్

పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్‌ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్‌ కోహ్లి ( RCB Won IPL 2025 ) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ  ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్‌ అన్న పేరుతో ఉన్న ట్వీట్‌ కావడంతో ఇది కచ్చితంగా సింగర్‌ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్‌ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్‌ అయ్యారు.

అసలు నిజమిదే! ఆర్సీబీ ఐపీఎల్‌ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్‌ ( Sonu Nigam ) ట్వీట్‌ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్‌ సోనూ నిగమ్‌ కాదు, బిహార్‌కు చెందిన లాయర్‌ సోనూ నిగమ్‌. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్‌కు బ్లూ టిక్‌ ఉండటంతో ఆ ట్వీట్‌ చేసి సింగర్‌ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్‌ సోషల్‌ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.

సోనూ నిగమ్ కన్నడ వివాదం

సోనూ నిగమ్‌ కన్నడ వివాదమేంటి? బెంగళూరులో సోనూ నిగమ్‌ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్‌ను కన్నడ పాటలు పాడాలని కోరారు. “కన్నడ, కన్నడ” అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్‌ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.

సారీ కర్ణాటక సోనూ నిగమ్‌ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆయనపై బ్యాన్‌ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.

నిజం ఏమిటి?

ఇటీవల జరిగిన ప్రమాదాలు ⇒ జూన్‌ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ⇒ జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్‌ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్‌ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు. ⇒ జూన్‌ 15న కేదార్‌నాథ్‌ సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు.

చివరికి, సోనూ నిగమ్ పేరుతో వచ్చిన ట్వీట్ వేరే వ్యక్తిది అని తేలింది. కన్నడ వివాదం తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడంతో విషయం సద్దుమణిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.