
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్‌లపై విడుదల కానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు సాయిలు కంపాటి చెప్పిన నిజమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు.
Key Points
అఖిల్, తేజస్విని జంటగా 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో నటించారు.
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్‌లపై ఈ చిత్రం విడుదలవుతుంది.
దర్శకుడు సాయిలు కంపాటి 2004లో జరిగిన నిజమైన ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ కథ పరువు హత్యకు సంబంధించినది కాకపోయినా, అలాంటి తీవ్రతను కలిగి ఉంటుంది.
రాజు వెడ్స్ రాంబాయి: కథా నేపథ్యం
అఖిల్(Akhil), తేజస్విని (Tejaswini)జంటగా నటిస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai)సినిమాను ఈనెల 21న వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ సాయిలు కంపాటి(Director Sailu Kampati). ‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, నా మనసంతా సినిమాలపైనే ఉండేది. కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసుకోవడం మొదలుపెట్టా. డైరెక్టర్స్ వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాల దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశా. ఒకరోజు వేణు ఊడుగుల అన్నకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి అవకాశం ఇచ్చారు.
ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుని రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తుంటాడు. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది మాత్రం తెరపైనే చూడాలి. నేను చిన్నప్పుడు ఈ ఘటన గురించి విన్నాను. అప్పట్లో మా దగ్గర సొసైటీలో ఎవరికైనా ఏదైనా గొడవ జరిగితే అన్నలు వచ్చి కొట్టి, బెదిరించి ఆ ఇష్యూను సెటిల్ చేసేవాళ్లు. ఈ కథలో బాధిత కుటుంబం వాళ్లను కలిసి ఇలా సినిమా చేస్తున్నానని అడిగితే, సినిమా చేయి గానీ మా పేర్లు, ఫొటోస్ బయటకు రాకుండా చూడమని కోరారు. 2004లో జరిగిన నిజమైన ఘటన ఇది. మా కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది. వేణు అన్న, బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా మూవీ ఔట్ పుట్ చూసి సంతోషించారు. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు.
నిజ జీవిత సంఘటన ఆధారంగా సినిమా
దర్శకుడు సాయిలు కంపాటి ఇంటర్వ్యూ హైలైట్స్
2004లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. బలమైన కథనంతో, నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.


