
📌 Key Points
- రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
- ట్రోల్స్ చేయడానికి గల కారణాలను వివరిస్తూ రేణు దేశాయ్ వీడియో విడుదల.
- సెలబ్రిటీ కాబట్టి తిట్టి ఫేమస్ అవ్వాలని ట్రోలర్స్ చెప్పినట్లు రేణు దేశాయ్ వెల్లడి.
- వీధి కుక్కల వివాదంపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలే ట్రోలింగ్‌కు కారణం.
ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరంగా కామెంట్లు చేయడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రేణు దేశాయ్ ఫిర్యాదుతో స్పందించిన సైబర్ క్రైమ్
Renudesai: ఈమధ్య కాలంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.. కొంతమంది అదే పనిగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారు. ఈ కామెంట్ల వల్ల సెలబ్రిటీలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ , పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పై కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది బూతులు తిడుతూ రెచ్చిపోతూ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. దాంతో సైబర్ క్రైమ్ ను రేణు దేశాయ్ ఆశ్రయించింది. దీంతో రంగం లోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఏకంగా 6 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు రేణు దేశాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది.
ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ ఇటీవల కాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ అంశాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలకు ధీటుగా ఆమెపై కొంతమంది బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 6 మందిని అరెస్టు చేశారు.
ట్రోలర్స్ అరెస్ట్‌పై రేణు దేశాయ్ కృతజ్ఞతలు
ఇకపోతే పోలీసులు 6 మందిని అరెస్టు చేయడంతో రేణు దేశాయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. “నన్ను సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టిన అందరి పైన కేసులు పెట్టాను. ఇప్పటికే పోలీసులు ఆరు మందిని అరెస్టు చేశారు. మరి కొంతమందిని అరెస్టు చేస్తున్నారు. ఆమె వల్ల మీకేమి కష్టం జరగలేదు కదా ఎందుకు ఆమెను తిడుతున్నారు అని వాళ్ళని అడిగితే.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి మేము ఆమెను తిట్టి ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాం అంటూ వాళ్ళు చెబుతున్నారు. బూతులు తిట్టి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు.. మీరు అరెస్టు అయితే మీ ఫ్యామిలీ పరువు పోతుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ హెచ్ఆర్ కి కంప్లైంట్ చేస్తాను” అంటూ రేణు దేశాయ్ తెలిపింది.
అసలు ఈ ట్రోలింగ్ ఎక్కడ మొదలైంది? అనే విషయానికి వస్తే.. కొన్ని నెలల క్రితం వీధి శునకాల వివాదంపై రేణు దేశాయ్ మాట్లాడింది.అన్ని కుక్కలు చెడు కాదు.. ఒకవేళ అవి చెడు అయితే వాటిని దగ్గర్లోని అధికారులకు అప్పచెప్పాలి. లేదంటే మా సంస్థకు చెబితే ఆ డాగ్ ను తీసుకెళ్తాము ” అంటూ రేణు దేశాయ్ తెలిపింది. దీంతో కొంతమంది ట్రోలర్స్ కుక్కలు రేణు దేశాయ్ ను, వారి పిల్లల్ని కొరకాలి.. ప్రైవేట్ పార్ట్ లను కొరికితే అప్పుడు తెలుస్తుంది అంటూ చాలా నీచంగా కామెంట్ చేశారు. ఇంకా నీచాతి నీచమైన, ఘోరమైన భాషలో తిడుతూ బూతులు పెట్టారు. దీంతోనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఆరు మందిని అరెస్టు చేశారు.
ట్రోలింగ్‌కు కారణం ఏమిటి?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
రేణు దేశాయ్‌ను ట్రోల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు ఇతరులకు ఒక హెచ్చరికను పంపారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.


