|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు! ట్రోల్స్ పై తీవ్ర ఆగ్రహం! అసలేం జరిగిందంటే?

Published: 19-01-2026, 8:00 PM
రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు! ట్రోల్స్ పై తీవ్ర ఆగ్రహం! అసలేం జరిగిందంటే?
  • రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు.
  • డాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియాపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • తన పిల్లల గురించి నీచంగా కామెంట్లు చేస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • కుక్కల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని రేణు దేశాయ్ తెలిపారు.

ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తీవ్రంగా స్పందించారు. డాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్లు చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాలపై రేణు దేశాయ్ క్లారిటీ

Renu Desai: ప్రముఖ నటి రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలతో పాటు ఈమె జంతు సంరక్షణలో కూడా భాగమవుతుంది. నిత్యం జంతువుల కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు అయితే ఎవరైనా జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ తనదైన శైలిలోనే స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా ఈమె డాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడమే కాకుండా ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్ అనంతరం రేణు దేశాయ్(Renu Desai) తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ మూడు విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

రేణు దేశాయ్ రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు గురించి ఈమె క్లారిటీ ఇచ్చారు నేను ఎలాంటి రాజకీయాలలోకి రావడం లేదని అందరికీ క్లారిటీగా తెలియజేశారు. ఒకవేళ తాను రాజకీయాలలోకి వస్తాను అనుకుంటే కచ్చితంగా ఆ విషయాన్ని నేను అధికారికంగా వెల్లడిస్తానని తెలియజేశారు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ(Political entry) పై వచ్చే వార్తలను నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ డాగ్ ప్రెస్ కార్యక్రమంలో భాగంగా రేణు దేశాయ్ మీడియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చాలా మంది తనని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారని తెలిపారు. అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టారు, తనకు ఎంత తిక్క ఉందో ఇప్పుడే తెలుస్తోంది అంటూ చాలా కామెంట్లు పెట్టారు. దయచేసి అలాంటి చండాలమైన కామెంట్లు పెట్టకండి. రిపోర్టర్ నామీద అరవడంతోనే నేను కూడా అరిచానని నేనెప్పుడూ మీడియా వారిపై దురుసుగా మాట్లాడనని ఈమె తెలియజేశారు.

సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆగ్రహం

తాను ఒక మనిషిగా ప్రాణాలకే విలువ ఇస్తానని , వారి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే చాలామంది నా పిల్లల గురించి కూడా చండాలంగా కామెంట్లు చేస్తున్నారు. నా బిడ్డలకు కుక్కలు కరవాలని, నా బిడ్డలు చనిపోవాలి అంటూ నీచమైన కామెంట్లు చేస్తున్నారని, దయచేసి అలాంటి కామెంట్లు మాత్రం చేయొద్దు ఒకవేళ మీ వీధిలో కుక్కలు కనుక కరవడానికి వస్తున్నట్లయితే వెంటనే మా షెల్టర్ కు ఒక ఫోన్ చేయండి వెంటనే మేము కుక్కలను అక్కడ నుంచి తరలిస్తాము అంటూ రేణు దేశాయ్ తెలిపారు.

?igsh=MTc3YjNkMGpqazdvOQ%3D%3D

పిల్లల గురించి కామెంట్స్‌పై ఆవేదన

ఇలా రేణు దేశాయ్ కుక్కల సంరక్షణ గురించి మాట్లాడటంతో చాలామంది తన పిల్లలకి కుక్కలు కలవాలని కోరుకోవడం బాధాకరం అంటూ ఈమె కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రేణు దేశాయ్ కెరియర్ విషయానికి వస్తే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.