|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రివాల్వర్ రీటా విడుదల తేదీ: ఆ పండుగకే వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్

Published: 12-06-2025, 10:11 AM
రివాల్వర్ రీటా విడుదల తేదీ: ఆ పండుగకే వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ నటించిన ‘రివాల్వర్ రీటా’ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో విడుదల అవుతుంది.

Key Points

1

కీర్తి సురేశ్ నటించిన 'రివాల్వర్ రీటా' విడుదల తేదీ ఖరారు.

2

ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా సినిమా విడుదల.

4

ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

రివాల్వర్ రీటా విడుదల తేదీ ప్రకటన

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ప్రత్యేకంగా అనౌన్స్‌మెంట్‌ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు.

కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ పోస్ట్‌ర్‌ను షేర్ చేశారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  కాగా.. ఈ చిత్రంలో రెడిన్‌ కింగ్‌స్లీ, మైమ్‌గోపీ, సెండ్రాయిన్, స్టంట్‌ మాస్టర్‌ సూపర్‌సుబ్బరాయన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్‌ స్టూడియోస్, ది రూట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.

వినాయక చవితి కానుకగా విడుదల

ఇక బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్‌లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌పుల్‌ హీరోయిన్‌గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్‌లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌ ధావన్‌కు జంటగా  బేబీజాన్‌ చిత్రంలో నటించారు.

చివరగా, కీర్తి సురేష్ అభినయంతో రూపొందిన ‘రివాల్వర్ రీటా’ చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.