
📌 Key Points
- ఆర్జీవీ శిష్యుడు దర్శకత్వంలో ‘రంగీలా’ రీమేక్ బాధ్యతలు!
- ప్రెజెంట్ జనరేషన్ ట్రెండ్ కి తగ్గట్టుగా మార్పులు!
- కొత్త హీరోకి ఊర్మిళ తరహా గ్లామర్ డెబ్యూ ప్లాన్!
- వర్మ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మళ్లీ టచ్ చేసే సాహసం!
రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రంగీలా’ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ కిడ్ కోసం రంగంలోకి ఆర్జీవీ!
Rangeela: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా(Rangeela)’ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఊర్మిళా మటోండ్కర్ గ్లామర్, అమీర్ ఖాన్ అద్భుత నటన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ముంబై వీధుల్లో తిరిగే ఒక సామాన్య యువకుడు, సినిమా స్టార్ కావాలని కలలుగనే అమ్మాయి మధ్య సాగే ఈ ప్రేమకథ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది.
‘రంగీలా’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ఇప్పుడు దాదాపు 31 ఏళ్ల తర్వాత, అదే మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై పునరావృతం చేసేందుకు ఆర్జీవీ సిద్ధమవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగులో ఒక స్టార్ ప్రొడ్యూసర్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఆర్జీవీకి అప్పగించాడట. అందుకోసం ‘రంగీలా’ కథను రీమేక్ చేస్తే బాగుంటుందని వర్మ భావిస్తున్నారట. అయితే ఈసారి ఆయన నేరుగా కాకుండా తన పర్యవేక్షణలో తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట.
కొత్త ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులు!
ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా ఒరిజినల్ కథలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్లామర్, ఎమోషన్స్ కలగలిసిన ఈ కథ కొత్త హీరోకు సరైన డెబ్యూ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన మేకింగ్‌తో షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ, గత కొంతకాలంగా తన మార్క్ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఈ నేపధ్యంలోనే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రంగీలా’ను మళ్లీ టచ్ చేయడం అనేది సాహసమనే చెప్పాలి. ఆయన అభిమానులు కూడా వర్మ మళ్లీ తన పాత పంథాలోకి వచ్చి, క్వాలిటీ సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నారు. మరి ఈ మెగా రీమేక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.
మరి రామ్ గోపాల్ వర్మ ఈ రీమేక్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


