|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హోంబలే ఫిలిమ్స్‌కు రిషబ్ శెట్టి గుడ్ బై చెప్పేశారా? కాంతార సీక్వెల్ భవితవ్యం ఏమిటి?

Published: 20-03-2026, 2:05 AM
హోంబలే ఫిలిమ్స్‌కు రిషబ్ శెట్టి గుడ్ బై చెప్పేశారా? కాంతార సీక్వెల్ భవితవ్యం ఏమిటి?
  • హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను రిషబ్ శెట్టి అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్.
  • కాంతార సినిమా పేజీని కూడా అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.
  • విభేదాలపై రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
  • కాంతార సీక్వెల్ పై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిషబ్ శెట్టి కాంతార సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన హోంబలే ఫిలిమ్స్‌ను, కాంతార అఫీషియల్ పేజీని ఇంస్టాగ్రామ్ నుండి అన్ ఫాలో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రిషబ్ శెట్టి అన్ ఫాలో వెనుక అసలు కారణం ఏంటి?

Rishabh Shetty:రిషబ్ శెట్టి(Rishabh Shetty).. దర్శకుడిగా, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ‘కాంతారా’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో కూడా సంచలనం సృష్టించారు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా నటుడిగా, దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు.. అలాంటి ఈయన తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను, కాంతార అఫీషియల్ పేజీని అన్ ఫాలో చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా ఒక హీరో, ఒక నిర్మాణ సంస్థతో సినిమా చేశారు అంటే.. ఆ హీరోకి ఆ నిర్మాణ సంస్థతో మంచి అభినభావ సంబంధం ఏర్పడుతుంది. అలాంటిది తన కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిన సినిమా పేజినే ఇప్పుడు రిషబ్ శెట్టి అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది. దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? నిర్మాణ సంస్థతో హీరోకి విభేదాలు ఏర్పడ్డాయా? అనే అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు..

ఇకపోతే ఈ విషయంపై అటు రిషబ్ శెట్టి కానీ ఇటు హోంబలే ఫిలిమ్స్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి. కాంతార కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయిన తర్వాత తర్వాతి పార్ట్ కోసం ప్రేక్షకులు ఏందో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం అటు అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

నిర్మాణ సంస్థతో విభేదాలే కారణమా?

ఇకపోతే ఒకవైపు ఇలా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు సెక్యూరిటీ కోసం తమ సోషల్ మీడియా ఖాతాలను క్లీన్ చేస్తూ ఉంటారు. అనవసరమైన పేజీలను అన్ ఫాలో చేస్తారు.. అంతమాత్రాన వారితో విభేదాలు ఉంటాయా ? నిజానిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా తన సొంత సినిమా పేజీని అన్ ఫాలో చేయడం మాత్రం చిన్న విషయమే కాదని చాలామంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కాంతార చాప్టర్ వన్ తర్వాత వచ్చే తదుపరి చిత్రంపై ఈ ప్రభావం భారీగా పడుతుందనే కామెంట్లు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

కాంతార 2 ఉంటుందా.. ఉండదా?

కాంతార సినిమా విషయానికి వస్తే.. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని రికార్డులు సొంతం చేసుకుని.. ఇక ఈ సినిమా కొనసాగింపుగా కాంతార చాప్టర్ వన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతకుమించి విజయం సొంతం చేసుకుంది..అటు టీవీలలో ఇటు ఓటిటిలో మంచి రేటింగు సొంతం చేసుకొని దూసుకుపోతోంది.. ఇప్పటికీ కూడా టీవీలలో ఈ సినిమాకి ఆదరణ విపరీతంగా ఉంది. అలాంటిది ఇప్పుడు చిత్ర నిర్మాతకి హీరోకి మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు నిజమైతే, కాంతార సీక్వెల్‌పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అభిమానులు మాత్రం ఆందోళనలో ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.