|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: సినిమాల్లేవు.. ఇప్పుడు అది కూడా ఆగిపోయే!

Published: 24-06-2025, 12:42 AM
Samantha: సినిమాల్లేవు.. ఇప్పుడు అది కూడా ఆగిపోయే!

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంతకు ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ‘ఖుషి’, ‘సిటాడెల్’ వంటి సినిమాలు ఆమెకు అనుకున్నంత విజయం ఇవ్వలేదు. తాజాగా ఆమె నటిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ పై ఆందోళనలు కనిపిస్తున్నాయి.

Key Points

1

సమంతకు ప్రస్తుతం కొత్త సినిమా అవకాశాలు లేవు.

2

రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు.

4

ఈ పరిస్థితి సమంతకు కష్టకాలాన్ని తెచ్చిపెడుతుందా?

సమంతకు కష్టకాలం?

హీరోయిన్‌గా సమంత స్టార్ హోదా చూసింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెద్గగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కొన్నిరోజుల క్రితం ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ ఓకే అనిపించుకుంది కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేశాయి. అలా నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది. కానీ నటిగానే ఈమెకు కష్టకాలం నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!

నాగచైతన్యకు 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. తర్వాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేసింది. ఇది పర్లేదనిపించుకోగా..  తర్వాత ‘సిటాడెల్’ ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ప్రస్తుతానికైతే ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.

రక్త బ్రహ్మాండ్ సిరీస్‌పై ఆందోళన

కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ పనిచేస్తున్న ఓ వ్యక్తి.. బడ్జెట్‌ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌ చేశాడని, 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ.. సగానికి బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది. ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్‌ నడిచింది. ఇ‍ప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.

సినిమా అవకాశాల కొరత

అయితే చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు. ఒకవేళ గనుక ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

సమంతకు ప్రస్తుతం కొత్త సినిమా అవకాశాలు లేకపోవడం, ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌పై ఆందోళనలు ఆమె భవిష్యత్తుపై ప్రశ్నార్థకం తెస్తున్నాయి. ఈ పరిణామాలు ఆమె వృత్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.