
📌 Key Points
- సమంత, రాజ్ డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నారు.
- రాజ్ సోదరి సీతల్, సమంత పెళ్లి మరియు మెహందీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- మెహందీ వేడుకలో ఆకుపచ్చ దుస్తుల్లో సమంత చాలా క్యూట్ గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
- పెళ్లి తర్వాత హనీమూన్ లేకుండా సినిమా షూటింగ్‌లో సమంత బిజీగా గడుపుతున్నారు.
సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ వివాహం ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత రాజ్ సోదరి సీతల్ షేర్ చేసిన మెహందీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సమంత ఎంతో క్యూట్‌గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంత పెళ్లి తర్వాత మొదటి ఫోటో
Samantha -Raj: సినీ నటి సమంత డిసెంబర్ ఒకటవ తేదీ ప్రముఖ దర్శకుడు రాజ్ ను కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ బైరవి ఆలయంలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం భూత శుద్ధి పద్ధతిలో జరిగింది. ఇలా వీరి పెళ్లి ఫోటోలను సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు అభినందనలు తెలియజేశారు. ఇకపోతే సమంత పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను రాజ్ సోదరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు..
రాజ్ కు ఒక సోదరు ఉందనే సంగతి మనకు తెలిసిందే. సమంత షేర్ చేసిన పెళ్లి ఫోటోలలో ఈమె కనిపించకపోయిన అనంతరం సీతల్(Seethal) తన సోషల్ మీడియా వేదికగా సమంత పెళ్ళికి సంబంధించిన ఫోటోలను తరచూ షేర్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈమె వీరి మెహందికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా రాజ్ కుటుంబ సభ్యులందరూ ఉండటం విశేషం. మెహందీ కావడంతో అందరూ కూడా ఆకుపచ్చ దుస్తులను ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన సీతల్ ప్రేమను పంచండి అంటూ ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలలో సమంత చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు.
రాజ్ సోదరి షేర్ చేసిన మెహందీ ఫోటోలు
సమంత మెహందీ కలర్ డ్రెస్సులో చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇలా సమంత పెళ్లి తర్వాత ఆమె ఆడపడుచు సోషల్ మీడియా వేదికగా సమంతకు సంబంధించిన ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక శీతల్ వీరిద్దరి వివాహం జరిగినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అలాగే సమంతకు తమ ఫ్యామిలీలోకి చాలా ఘనంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతల్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై సమంత అభిమానులకు కూడా స్పందిస్తూ క్యూట్ కపుల్.. ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత పెళ్లి తర్వాత తన భర్త రాజ్ తో కలిసి ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు.
ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం కొంత గ్యాప్ ఇచ్చిన సమంత పెళ్లయిన వెంటనే హనీమూన్ కూడా ప్లాన్ చేయకుండా తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నిర్మాతగా నటిగా కొనసాగడమే కాకుండా బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్లోతింగ్ బిజినెస్ తో పాటు ఫర్ఫ్యూమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. Also Read: Akhanda 2 Issues : ఇదంతా ఫ్లోలో జరుగుతుందా… లేదా బాలయ్యపై కక్ష కట్టారా? Tags RAJ NIDIMORU samantha Seethal Share
సినిమా షూటింగ్‌లో బిజీగా సమంత
ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం కొంత గ్యాప్ ఇచ్చిన సమంత పెళ్లయిన వెంటనే హనీమూన్ కూడా ప్లాన్ చేయకుండా తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నిర్మాతగా నటిగా కొనసాగడమే కాకుండా బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్లోతింగ్ బిజినెస్ తో పాటు ఫర్ఫ్యూమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Akhanda 2 Issues : ఇదంతా ఫ్లోలో జరుగుతుందా… లేదా బాలయ్యపై కక్ష కట్టారా?
పెళ్లి తర్వాత సమంత తన పని పట్ల చూపిస్తున్న నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సీతల్ షేర్ చేసిన ఈ క్యూట్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు.

