
సమంత చాలాకాలం తర్వాత హీరోయిన్‌గా సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ గురించి ఆమె ఇచ్చిన అప్డేట్ ఇదే.
Key Points
సమంత త్వరలో 'మా ఇంటి బంగారం' సినిమాతో హీరోయిన్‌గా తిరిగి వస్తున్నారు.
సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో సమంత నటించడం అనేది అబద్ధమని ఆమె స్పష్టం చేశారు.
శుభం సినిమాలో సమంత గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
సమంత సినిమా అప్డేట్
Samantha : సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో 2023 లో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సమంత సినిమా రాలేదు. ఈ గ్యాప్ లో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇప్పుడు నిర్మాతగా శుభం అనే సినిమాతో రాబోతుంది. శుభం సినిమా మే 9 రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో నేడు మీడియాతో మాట్లాడింది సమంత. ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. హీరోయిన్ గా మళ్ళీ ఎపుడు సినిమా చేస్తున్నారు? మెయిన్ లీడ్ లో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం సినిమా సంగతేంటి అని అడిగారు.
మా ఇంటి బంగారం సినిమా
దీనికి సమంత సమాధానమిస్తూ.. నేను మెయిన్ లీడ్ గా ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ఒక్కటే చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ మొదలవుతుంది అని తెలిపింది. అలాగే అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో సమంత హీరోయిన్ అన్న రూమర్స్ అబద్దం అని క్లారిటీ ఇచ్చింది.
అల్లు అర్జున్ సినిమా రూమర్స్
వచ్చే నెలలో సమంత షూట్ మొదలుపెడితే ఆ సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సమంత ఫ్యాన్స్ ఆమెని మెయిన్ లీడ్ లో థియేటర్లో చూడాలని ఎదురుచూస్తున్నారు. సో ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. ఈ లోపు శుభం సినిమాలో సమంత గెస్ట్ పాత్రలో కనిపించనుంది.
చివరగా, సమంత అభిమానులకు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మంచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కావచ్చు.


