
📌 Key Points
- సమంత దర్శకుడు రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకున్నారు.
- వివాహం తర్వాత హనీమూన్ పక్కనపెట్టి ‘మా ఇంటి బంగారం’ సినిమాపై దృష్టి పెట్టారు.
- నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తున్నారు.
- చీరకట్టులో డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం సమంతకు కొత్త సవాల్.
హీరోయిన్ సమంత సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. మయసైటీస్ నుండి కోలుకుని, రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె మళ్ళీ బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సమంతకు చీరకట్టులో యాక్షన్ సీన్స్ చేయడం సవాల్‌గా మారింది.
రెండో వివాహం తర్వాత సినీ రంగంలో సమంత
Samantha : హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే” సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ”దూకుడు” సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
విడాకులు, రెండో పెళ్లి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలం మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడ్డారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్న సమంత తిరిగి సినిమాల్లో నటించడంతో పాటు, నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే అలాంటి సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడుమోరుతో కొంతకాలం డేటింగ్ చేసిన సమంత , అతన్ని వివాహం చేసుకుంది. ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.పెళ్లి చేసుకున్నప్పటికీ హనీమూన్ వెళ్లకుండా, సినిమా పైన ఫోకస్ చేశారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తున్నారు సమంత.
మా ఇంటి బంగారం: చీరకట్టులో యాక్షన్ సవాల్
హనీమూన్ వద్దు.. సినిమానే ముద్దు సాధారణంగా పెళ్లి తర్వాత సెలబ్రిటీలు లాంగ్ హనీమూన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా, వివాహం జరిగిన వెంటనే సెట్స్ లోకి అడుగుపెట్టారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా ద్వారా తన మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించుకోవాలని ఆమె పట్టుదలతో ఉన్నారు.
చీరకట్టులో భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో సమంత పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. అయితే, షూటింగ్ లో సామ్ కు ఇప్పుడు సరికొత్త కష్టం వచ్చిపడింది. కథా డిమాండ్ ప్రకారం ఇందులో ప్రతి సీన్ ఆమె చీరకట్టులోనే కనిపించాలట. కేవలం డ్రామా సీన్స్ మాత్రమే కాదు.. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను కూడా ఆమె చీరకట్టులోనే చేయాల్సి వస్తోంది.గతంలో ఎన్నో గ్లామర్ పాత్రలు, మోడ్రన్ యాక్షన్ సీన్స్ చేసిన సమంతకు, చీరలో యుద్ధం చేయడం సవాల్‌గా మారింది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారట. రెండో వివాహం తర్వాత కచ్చితంగా సక్సెస్ కొట్టాలి అనే కసితో ఆమె పడుతున్న ఈ కష్టం చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు.
డూప్ లేకుండా సామ్ సాహసం
మరో బ్లాక్ బస్టర్ దిశగా.. సమంత నిర్మాతగా, నటిగా తన శక్తి సామర్థ్యాలను ఈ సినిమా కోసం ధారపోస్తున్నారు. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత నందిని రెడ్డి – సమంత కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని కష్టాలను అధిగమించి సమంత ఎలా మెరుస్తుందో చూడాలి.
ఆరోగ్య సమస్యలు, విడాకులు, రెండో పెళ్లి.. ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన నటనపై ఏ మాత్రం శ్రద్ధ తగ్గించలేదు. కష్టాలను అధిగమించి, కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఆమె నిత్యం ముందుకు సాగుతున్నారు. ఆమె అంకితభావం అభినందనీయం.


