
📌 Key Points
- సమంత, రాజ్ నిడిమోరుల వివాహం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ యోగా ఆశ్రమంలో జరిగింది.
- వారి మెహందీ వేడుక నుండి ఒక ఫోటోను సమంత వదిన శీతల్ నిడిమోరు ‘ప్రేమను పంచుకుంటే ప్రేమ గుణించబడుతుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.
- ఈ వైరల్ ఫోటోలో సమంత, రాజ్ నిడిమోరు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించారు.
- సమంతను ఎల్లప్పుడూ సంతోషంగా చూసుకోమని నెటిజన్లు, అభిమానులు రాజ్ కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత, వారి మెహందీ ఫంక్షన్ నుండి ఒక అందమైన ఫోటో వైరల్ అయింది. సమంత వదిన శీతల్ నిడిమోరు ఈ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సంతోషంగా ఉన్న జంటను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ, వారిపై కామెంట్స్ చేస్తున్నారు.
సమంత-రాజ్ నిడిమోరుల వివాహ విశేషాలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ఇటీవలే పెళ్లిపీటలెక్కన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుక తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్ లో బిజీ అయిపోయారు సమంత, రాజ్. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రాజ్ విషయానికి వస్తే.. ఇటీవల అతను తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’(The Family Man-3) వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో దూసుకెళ్లిపోతోంది. ఇటీవలే ముంబయిలో ఈ సిరీస్ సక్సెస్ పార్టీ కూడా నిర్వహించారు.
వదిన షేర్ చేసిన మెహందీ ఫోటో వైరల్
ఇదిలా ఉంటే.. సమంత- రాజ్ పెళ్లి తర్వాత కొన్ని రోజులకే వారి మెహందీ ఫంక్షన్ నుండి ఒక అందమైన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోను సమంత వదిన శీతల్ నిడిమోరు(Seetal Nidimoru) షేర్ చేస్తూ “ప్రేమను పంచుకుంటే ప్రేమ గుణించబడుతుంది.” అనే క్యాప్షన్ జోడించింది. అయితే ఈ ఫొటోలో రాజ్ అండ్ సామ్ చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ రాజ్ ఫ్యామిలీతో సామ్ ఎంత హ్యాపీగా ఉందో, తనని ఇలానే హ్యాపీగా చూసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న నెటిజన్ల కామెంట్స్
A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru)
సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వదిన షేర్ చేసిన మెహందీ ఫోటో వారి ఆనందాన్ని ప్రతిబింబిస్తూ, నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఈ జంట ఎప్పటికీ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.


