|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ రీఎంట్రీతో టాలీవుడ్ షేక్! `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీ రిలీజ్..రివ్యూ అదుర్స్!

Published: 06-03-2026, 7:05 AM
శివాజీ రీఎంట్రీతో టాలీవుడ్ షేక్! `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీ రిలీజ్..రివ్యూ అదుర్స్!
  • శివాజీ రీఎంట్రీ మూవీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` విడుదల! థియేటర్లలో సందడి
  • దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మార్క్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో చిత్రం
  • లయతో శివాజీ జోడీ, రోహన్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు!
  • బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పణలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది

శివాజీ చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు! ఆయన నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీ విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మూవీ రివ్యూ మీకోసం!

శివాజీ మార్క్ కామెడీతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్!

నటుడు శివాజీ `బిగ్‌ బాస్‌` షో తర్వాత మళ్ళీ కమ్‌ బ్యాక్‌ అయ్యాడు. ఆయన లయతో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని`. సుధీర్ శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రిక్కి సమర్పణలో శివాజీ స్వయంగా నిర్మించారు. ఈటీవీ విన్‌ సమర్పణలో బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమాని విడుదల చేశారు. మొదట ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కంటెంట్‌పై నమ్మకంతో థియేటర్‌లోకి  తీసుకొచ్చారు. బాలనటుడు రోహన్‌, ధన్‌ రాజ్‌, ప్రిన్స్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(మార్చి 6)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

శ్రీరామ్‌(శివాజీ) పంచాయితీ సెక్రెటరీ. మదనపల్లిలో వర్క్ చేస్తుంటాడు. చాలా స్టిక్ట్ అధికారి. ఎవరి ప్రలోభాలకు లొంగడు. ఆయన భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్‌) చాలా వైల్డ్ గా ఉంటారు. శ్రీరామ్‌కి, వాళ్లకి సంబంధమే లేదన్నట్టుగా ఉంటారు. ఆ ఊర్లో ఎస్‌ఐ విక్రమ్‌(ప్రిన్స్)కి అమ్మాయిల పిచ్చి. పోలీస్‌ స్టేషన్‌లో కంటే ఆడవాళ్లతోనే ఎక్కువగా ఉంటాడు. ఓ రోజు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద శ్రీరామ్‌కి, ఎస్‌ఐకి గొడవ అవుతుంది. ఓ రోజు ఎమ్మెల్యే పీఏ ఇంటికి వచ్చిన ఎస్‌ఐ.. పక్కనే ఉన్న శ్రీరామ్‌ ఇంటికి వస్తాడు. అక్కడ ఆయన భార్యని చూసి మోజు పడతాడు. ఇంతలోనే కొడుకు బిట్టు వస్తాడు. గన్‌ ఆట ఆడుతూ, నిజంగానే ఎస్‌ఐని కాల్చేస్తాడు. దీంతో ఏం చేయాలని టెన్షన్‌ పడతారు. శ్రీరామ్‌ పోలీసులకు లొంగిపోవాలనుకుంటాడు. కానీ భార్య వద్దు అంటుంది. దీంతో బాడీ మాయం చేయాలనుకుంటున్నారు. మరి మాయం చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ మర్డర్‌లో అసలు ట్విస్ట్ ఏంటి?  తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు శ్రీరామ్‌ ఏం చేశాడనేది మిగిలిన కథ.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

శివాజీ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ ఉంది. ఇటీవల ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి కంటెంట్‌తో వస్తున్నాయి. దీంతో `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని` మూవీపై కూడా మంచి అంచనాలున్నాయి. తన మార్క్ కామెడీని జోడిస్తూనే, థ్రిల్లర్‌గా సినిమాని నడిపించారు. సినిమా ప్రారంభం నుంచి ఫన్నీగా సాగుతుంది. ముఖ్యంగా శివాజీ పాత్ర తమ ఫ్యామిలీని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత కొడుకు రోహన్‌ చేసే కామెడీ క్రేజీగా ఉంటుంది. అంతలోనే ప్రిన్స్ చేసే ఓవరాక్షన్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అయితే ప్రిన్స్ శ్రీరామ్‌తో గొడవపడటం, ఆ తర్వాత తన ఇంట్లోకి రావడం, అతన్ని కొడుకు కాల్చేయడం చకచక జరుగుతుంది. ప్రిన్స్ మరణం తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. బాడీని మాయం చేయడానికి వాళ్లు పడే స్ట్రగుల్‌ నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా శివాజీ, లయ మధ్య సన్నివేశాలు క్రేజీగా ఉంటాయి.  వారి ట్రాక్‌ అకట్టుకునే ఉంటుంది. శివాజీ, భార్యకి, రోహన్‌ కి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ లా ఉంటుంది. రోహన్‌ చేసే చిల్లర పనులు నవ్విస్తాయి. శవాన్ని మాయం చేయడానికి సంబంధించి చేసే పనులు థ్రిల్‌కి గురి చేస్తాయి. కొన్ని సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్ బాగానే ఉంటుంది. సెకండాఫ్‌ లో అనేక ట్విస్ట్ లు టర్న్ లతో సాగుతుంది. అడగడుగునా ఏం జరుగుతుందనేది ఉత్కంఠకి గురిచేస్తుంది. మధ్యలో అలీ ట్రాక్‌ బాగుంటుంది. అలాగే ఇమ్మాన్యుయెల్‌ ట్రాక్‌ కూడా మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమా కథ మొత్తాన్ని మార్చేస్తుంది. వాహ్‌ అనిపిస్తుంది. అయితే సినిమా కాస్త స్లోగా సాగుతుంది. కథఅక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. ఫన్‌ అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు కూడా ఇంకా బాగా ప్లాన్‌ చేసుకోవాల్సింది. కొన్ని లాజిక్‌ లెస్‌గా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మూవీ ఇంకా బాగుండేది.

శ్రీరామ్‌ పాత్రకి శివాజీ చాలా బాగా సెట్‌ అయ్యారు. చాలా సెటిల్డ్ గా చేశారు. భార్యతో, కొడుకుతో తాను పడే స్ట్రగుల్స్ నవ్విస్తుంది. ఎంగేజ్‌ చేస్తుంది. ఉత్తర పాత్రలో లయ అదరగొట్టింది. ఆమె ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తన కామెడీతో మెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరగదీసింది. ఇక రోహన్‌ తనదైన కామెడీతో మెప్పించాడు. సినిమాకి హైలైట్‌గా నిలిచాడు. అలీ కాసేపు మెరిసి నవ్వించాడు. ప్రిన్స్ ఉన్న కాసేపు మెప్పించాడు. ధన్‌ రాజ్‌ పాత్ర అదిరిపోయింది. ఆయన పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. ఇమ్మాన్యుయెల్‌ కామెడీ నవ్విస్తుంది. మిగిలినపాత్రలు ఓకే అనిపించాయి.

రివ్యూ: శివాజీ నటనకు ప్రేక్షకులు ఫిదా!

సినిమాకి రంజిన్‌ రాజ్‌ సంగీతం అందించారు. మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం ఆకట్టుకునేలా, సీన్లని ఎలివేట్‌ చేసేలా ఉంది. రిత్విక్‌ రెడ్డి కెమెరా వర్క్ ఆకట్టుకునేలా, కనువిందుగా ఉంది. బాలు మనోజ్‌ డి ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఇంకా స్పీడ్‌ పెంచాల్సింది. సుధీర్‌ శ్రీరామ్‌ ఎంచుకున్న కథ రొటీన్‌గానే ఉన్నా, దాన్ని కొత్తగా డీల్‌ చేశారు. ఎంగేజింగ్‌ గా తీసుకెళ్లారు. క్రైమ్‌లోనూ కామెడీని మెళవించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు.

మూవీ సరదాగా ఎంజాయ్‌ చేసే క్రైమ్‌ కామెడీ చిత్రమిది. మంచి టైమ్‌ పాస్‌ మూవీ అవుతుంది.

`సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. శివాజీ తన రీఎంట్రీతో మరోసారి మెప్పించారు. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.