
📌 Key Points
- సంయుక్త మీనన్ 45 డిగ్రీల ఎండలో ‘బ్లాక్ గోల్డ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.
- మంచిర్యాల షెడ్యూల్ లో సంయుక్త, ఆమె టీమ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.
- డీ హైడ్రేషన్ బారిన పడకుండా సంయుక్త పర్సనల్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంది.
- షెడ్యూల్ పూర్తయ్యాక సంయుక్త తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
హీరోయిన్ సంయుక్త మీనన్ 45 డిగ్రీల ఎండలో కూడా ‘బ్లాక్ గోల్డ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొని తన డెడికేషన్‌ను నిరూపించుకున్నారు. మంచిర్యాల షెడ్యూల్‌లో ఆమె పడ్డ కష్టాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
45 డిగ్రీల ఎండలో సంయుక్త షూటింగ్ కష్టాలు!
Samyuktha Menon:సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకునే రోజులు పోయాయి. యాక్షన్ పర్ఫామెన్స్ తో తాము అదరగొట్టడానికి ఎప్పుడూ సిద్ధమే అని నిరూపిస్తున్నారు కొంతమంది హీరోయిన్లు.. మరికొంతమంది సాహసాలు కూడా చేసేస్తున్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి పాత్రల కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఒక హీరోయిన్ తన సినిమాలోని పాత్ర కోసం 45 డిగ్రీల మండే ఎండలో కూడా ఒత్తిడి, వేడి, అలసటను జయించి అందరినీ ఆశ్చర్యపరిచింది . ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ కాస్త కంప్లీట్ అవ్వడంతో తన అనుభవాలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ సంయుక్త మీనన్.
గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంయుక్త మీనన్ తాజాగా లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో చేస్తున్న చిత్రం బ్లాక్ గోల్డ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. తాజాగా మంచిర్యాల షెడ్యూల్ పూర్తి కాగా, ఆ షెడ్యూల్ లో తనకు ఎదురైన అనుభవాలను, తన టీం పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సంయుక్త. సినిమా గ్లామర్ వెనుక ఎంతటి కష్టం ఉంటుందో సంయుక్త తన మాటల్లో చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ.. ,తాజాగా మంచిర్యాల షెడ్యూల్ షూటింగు పూర్తయింది. ఇది మమ్మల్ని అన్ని విధాలా పరీక్షించింది. సుమారుగా 45 డిగ్రీల మండే ఎండలో పనిచేయడం మామూలు సవాలు కాదు. వేడి, అలసట మమల్ని వేధించినా.. మా టీమ్ మాత్రం అస్సలు ఎక్కడా తగ్గకుండా అంకితభావంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంటూ తన మూవీ టీం గురించి చెప్పుకొచ్చింది.
టీమ్ వర్క్ తో సవాళ్లను అధిగమించిన సంయుక్త
డీ హైడ్రేషన్ బారిన పడకుండా నా పర్సనల్ టీం తీసుకున్న జాగ్రత్తలు, డైరెక్టర్ యోగి ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఆ ఎండల్ని కూడా తట్టుకోగలిగాను. శారీరకంగా, మానసికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ షెడ్యూల్ మాత్రం మేము పూర్తి చేయడం నిజంగా సంతోషకరం అంటూ షెడ్యూల్ కి సంబంధించిన విషయాలను పోస్టు రూపంలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు , నెటిజన్లు సంయుక్త డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు.
షెడ్యూల్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం
ఇకపోతే షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈమె నేరుగా తిరుపతి చేరుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే తనకు అండగా నిలిచిన నిహారిక, పార్ధులకు కూడా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక బ్లాక్ గోల్డ్ సినిమా విషయానికి వస్తే.. సింగరేణి నేపథ్యంలో బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. అందుకే మంచిర్యాల వంటి కఠినమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. సంయుక్త పడుతున్న కష్టం చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా కూడా ఆమె కెరియర్ లో మరో హిట్ అందివ్వడం ఖాయమని అభిమానులు తమ అభిప్రాయంగా చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా సంయుక్త కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనం కూడా ఆశిద్దాం.
Tags Samyukta Menon tollywood Share
సంయుక్త మీనన్ తన అంకితభావంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిద్దాం. బ్లాక్ గోల్డ్ సినిమా కోసం ఎదురుచూద్దాం.


