|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sandhya Theatre: సంధ్య థియేటర్‌ ఘటన.. బాలుడు శ్రీతేజ్‌ డిశ్చార్జ్

Published: 29-04-2025, 12:11 PM
Sandhya Theatre: సంధ్య థియేటర్‌ ఘటన.. బాలుడు శ్రీతేజ్‌ డిశ్చార్జ్

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు చికిత్స పొందిన అతను ఇప్పుడు రికవరీ దశలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ఇది.

Key Points

1

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్.

2

146 రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రి నుండి ఇంటికి.

4

15 రోజుల ఫిజియోథెరపీ తర్వాత ఇంటికి తరలిస్తారు.

శ్రీతేజ్ డిశ్చార్జ్

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని  శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

146 రోజుల చికిత్స

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల  తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని  వైద్యులు సూచించారు.

పుష్ప 2 తొక్కిసలాట

కాగా.. గతేడాది డిసెంబర్‌ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్‌ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీతేజ్‌కు 15 రోజుల ఫిజియోథెరపీ అనంతరం ఇంటికి తరలించే అవకాశం ఉంది. ఈ ఘటన టాలీవుడ్‌కు పెద్ద షాక్‌గా మారింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.