
📌 Key Points
- సంజన గల్రాని దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సంచలనం.
- తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద నిర్మాత ఒకరు డబ్బు ఎగ్గొట్టినట్లు ఆరోపణ.
- ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసులు ఇంకా కోర్టులో కొనసాగుతున్నాయని వెల్లడి.
- డబ్బులిస్తే శత్రువులవుతారని జ్యోతిష్కులు చెప్పినట్లు నటి వివరణ.
టాలీవుడ్ నటి సంజన గల్రాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక పెద్ద నిర్మాత కారణంగా తాను కోట్లు నష్టపోయానని ఆమె చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలుసుకుని మీరు షాక్ అవ్వడం ఖాయం!
సంజన గల్రాని షాకింగ్ నిజాలు!
Sanjana Galrani : ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 50కి పైగా సినిమాలు చేసిన సంజన గల్రాని మధ్యలో డ్రగ్స్ ఆరోపణలు, జైలుకి వెళ్లి రావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సంజన. ప్రస్తుతం టీవీ షో లు, సీరియల్స్ తో బిజీగా ఉంది.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజన దాదాపు రెండు కోట్లు నష్టపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ టాలీవుడ్ నిర్మాత ఎవరు?
సంజన గల్రాని మాట్లాడుతూ.. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో పుట్టాను. నేను ఫస్ట్ సినిమా మీటింగ్ కి వెళ్తున్నప్పుడు కూడా సగం దూరం నడిచి వెళ్ళా. సగం దూరం ఆటోలో వెళ్ళా. నేను నా పేరెంట్స్ ని చూసుకోవాలి అప్పుడు. అలా డబ్బులు సేవ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు తెలిసిన వాళ్లకు ఓ నలుగురు ఐదుగురికి దాదాపు రెండు కోట్లు ఇచ్చి నష్టపోయాను. అందులో తెలుగు ఇండస్ట్రీలో ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారు.
కోట్ల నష్టం వెనుక అసలు కథ!
ఇప్పుడు కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదు. నాకు తర్వాత జ్యోతిష్కులు కూడా చెప్పారు నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు అని. ఇప్పుడు నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని తెలిపింది. అయితే సంజన దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరో మాత్రం చెప్పలేదు.
సంజన గల్రాని చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆ నిర్మాత ఎవరు, ఈ కేసుల పర్యవసానాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


