|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sasirekha Song Promo: మన శంకర వరప్రసాద్ నుంచి “శశిరేఖ” ప్రోమో.. పంచకట్టులో మెగాస్టార్ అదరగొట్టారు!

Published: 06-12-2025, 1:48 AM
Sasirekha Song Promo: మన శంకర వరప్రసాద్ నుంచి “శశిరేఖ” ప్రోమో.. పంచకట్టులో మెగాస్టార్ అదరగొట్టారు!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుండి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో విడుదలైంది.
  • ప్రోమోలో చిరంజీవి పంచకట్టులో, నయనతార తెల్ల శారీలో మెరిశారు, ఇది వైరల్ గా మారింది.
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
  • ‘శశిరేఖ’ పూర్తి సాంగ్ డిసెంబర్ 8న విడుదల కానుంది; సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్.

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” నుంచి “శశిరేఖ” సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో చిరంజీవి పంచకట్టులో, నయనతార తెల్ల శారీలో అద్భుతంగా కనిపించి ఆకట్టుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ వివరాలు

Sasirekha Song Promo: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో హైలైట్స్

Dhoolpet Police Station OTT: ఆహా ఓటీటీలో “ధూల్ పేట్ పోలీస్ స్టేషన్”.. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్విస్టులకు మైండ్ పోవడం ఖాయం..

సాంగ్, సినిమా విడుదల తేదీలు

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి శశిరేఖ(Sasirekha Song Promo) అనే పాట ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో పంచకట్టులో పెళ్లి కొడుకు గెటప్ లో కనిపించాడు మెగాస్టార్ చింరజీవి. ఇక తెల్ల శారీలో నయనతార కూడా ఒక రేంజ్ ఉంది. దీంతో ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శశిరేఖ ఫుల్ సింగ్ డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

మొత్తానికి, “శశిరేఖ” సాంగ్ ప్రోమోతో “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. పూర్తి పాట డిసెంబర్ 8న విడుదల కానుంది, ఇది సినీ అభిమానులను ఎంతగానో అలరిస్తుందని ఆశిద్దాం. 2026 సంక్రాంతికి సినిమా కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.