
రూ.577 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ సినిమా సయ్యారా ఈ వారం ఓటీటీలో విడుదలవుతోంది. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Key Points
రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూ.577 కోట్లు వసూలు చేసిన సయ్యారా సినిమా
ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
అహాన్ పాండే, అనీత్ పడ్డా నటన, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
సూపర్ హిట్ పాటలతో కూడిన మ్యూజికల్ రొమాంటిక్ మూవీ
సయ్యారా: ఓటీటీ ప్రయాణం ప్రారంభం
బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచిన సయ్యారా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండు నెలలుగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.577 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ మూవీ ఓటీటీలో ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన సయ్యారా మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా జులై 18న థియేటర్లలో రిలీజైంది.
రూ.577 కోట్ల వసూళ్లతో సంచలనం
సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. 50 రోజులకుపైగా థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఈ సినిమాపై ఓటీటీలో మరింత భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చీ రాగానే ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. కొత్త నటీనటులైన అహాన్ పాండే, అనీత్ పడ్డా ఇందులో నటించారు. ఓ సింగర్, లిరిసిస్ట్ మధ్య సాగే లవ్ స్టోరీయే ఈ మూవీ. కృష్ణ కపూర్, వాణి అనే లవర్స్ చుట్టూ తిరుగుతుంది. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా నటీనటుల నటన, మ్యూజిక్, సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఈ సయ్యారా మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కథ, నటన, సంగీతం – ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలు
ముఖ్యంగా సయ్యారా టైటిల్ సాంగ్ ఇప్పటికీ దేశాన్ని ఊపేస్తోంది. యువతను ఈ పాట బాగా ఆకట్టుకుంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.577 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విక్కీ కౌశల్ ఛావా మూవీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమాకు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూ.577 కోట్లు వసూలు చేసిన సయ్యారా సినిమా ఓటీటీలోనూ అదే విజయాన్ని సాధిస్తుందని అంచనా. నెట్‌ఫ్లిక్స్‌లో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.


