
📌 Key Points
- విజయవాడ డివిజన్‌లో ఆధునీకరణ పనుల కారణంగా రైళ్ల దారి మళ్లింపు.
- మే 1 నుంచి 5 వరకు పలు రైళ్లు ఇతర మార్గాల్లో ప్రయాణిస్తాయి.
- విజయవాడ – దువ్వాడ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది.
- కాజీపేట, వరంగల్ వంటి స్టేషన్లలో హాల్టింగ్ రద్దు.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ డివిజన్ రాయనపాడు యార్డులో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించనున్నారు. మే 1 నుంచి 5 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయి.
రైళ్ల దారి మళ్లింపునకు గల కారణాలు
South Central Railway Train Diversion Updates : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.విజయవాడ డివిజన్ రాయనపాడు యార్డులో జరుగుతున్న ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించనుంది. మే 1వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పలు ప్రధాన రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించనున్నట్లు ప్రకటించింది. ఈ పనుల కారణంగా… విజయవాడ – దువ్వాడ సెక్షన్ లో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడనుంది.
రాయనపాడు వద్ద జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా విశాఖపట్నం, ముంబై, షిరిడీ వంటి నగరాలకు వెళ్లే కీలక రైళ్లను దారి మళ్లిస్తారు. ముఖ్యంగా విజయవాడ – కాజీపేట – పగిడిపల్లి మీదుగా వెళ్లాల్సిన రైళ్లను విజయవాడ – కృష్ణ కెనాల్ – గుంటూరు – పగిడిపల్లి మీదుగా నడపనున్నారు.
ప్రభావిత రైళ్లు, స్టేషన్ల వివరాలు
దారి మళ్లింపు కారణంగా ఈ రైళ్లు సాధారణ మార్గంలో ఉండే కొన్ని ప్రధాన స్టేషన్లలో ఆగకుండా వెళ్తాయి. వీటిలో ప్రధానంగా కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, డోర్నకల్ వంటి స్టేషన్లున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించుకోవాలని… అందుకు అనుగుణంగా ప్రయాణాలు ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటన కూడా చేసింది. పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో శాతవాహన, గోల్కొండ, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటివి కూడా ఉన్నాయి.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచన
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాయనపాడు యార్డు ఆధునీకరణ పనుల కారణంగా రైళ్ల మార్గాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచిస్తుంది.


