|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sekhar Kammula: అందుకే రష్మిక సాంగ్‌ పెట్టలేదు.. శేఖర్ కమ్ముల క్లారిటీ

Published: 21-06-2025, 10:43 AM
Sekhar Kammula: అందుకే రష్మిక సాంగ్‌ పెట్టలేదు.. శేఖర్ కమ్ముల క్లారిటీ

ధనుష్, నాగార్జున నటించిన కుబేర సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా పాటను తొలగించడంపై దర్శకుడు శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు.

Key Points

1

కుబేర సినిమాలో రష్మిక సాంగ్ తొలగింపుపై శేఖర్ కమ్ముల వివరణ

2

పాన్ ఇండియా సినిమా కావడం వల్లే ఆ పాట తొలగించామని దర్శకుడు వెల్లడి

4

ఒక్క సీన్, ఒక్క డైలాగ్ తీసేస్తే సినిమా ఉండదని శేఖర్ కమ్ముల అభిప్రాయం

రష్మిక సాంగ్ తొలగింపుపై క్లారిటీ

ధనుశ్‌, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ కుబేర. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్‌ రావడంతో నాగ్ ఫ్యాన్స్‌తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుబేర సక్సెస్‌ కావడంతో ఇది శేఖర్ కమ్ముల మార్క్‌ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక సైతం తన పాత్రకు వస్తున్న ఆదరణను చూసి సంతోషంగా ఉందని తెలిపింది.

పాన్ ఇండియా సినిమా ప్రభావం

అయితే తాజాగా కుబేర సక్సెస్‌ కావడంతో టీమ్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్‌ అనే రష్మిక సాంగ్‌ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.

శేఖర్ కమ్ముల వివరణ

పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్‌ ఉండాలకున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఈ సాంగ్‌ను కావాలని మేము తీయలేదన్నారు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నట్లు వెల్లడించారు. వేరే మంచి సీన్‌ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదన్నారు. ఈ చిత్రంలో ఒక్క సీన్‌, ఒక్క డైలాగ్‌ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నానని శేఖర్ కమ్ముల వివరించారు.

చివరగా, కుబేర సినిమా విజయం తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో రష్మిక సాంగ్ తొలగింపుపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పష్టతనిచ్చారు. సినిమా కథకు ఆ పాట అడ్డు అని వివరించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.