
📌 Key Points
- ఐ బొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు, త్వరలో సైబర్ క్రైమ్ కస్టడీకి తరలిస్తారు.
- వందల కోట్ల పైరసీ ద్వారా సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- రవి వెనుక భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా విస్తరించి ఉన్న పెద్ద పైరసీ నెట్‌వర్క్ ఉంది.
- సినిమా టికెట్ల ధరల పెంపు కారణంగా రవికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.
పైరసీ కింగ్ ఐ బొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వందల కోట్ల రూపాయల పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తోంది.
ఐ బొమ్మ రవి సైబర్ క్రైమ్ కస్టడీ
IBomma Ravi: ఐ బొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఐ బొమ్మ(Ibomma) ద్వారా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు నష్టాన్ని తీసుకువచ్చారు. ఇలా సినిమా పైరసీలను అడ్డుకోవడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గత కొంతకాలంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పైరసీ తిమింగలం ఐ బొమ్మ రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు కోర్టు ఈయనకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈయన జైలులోనే ఉన్నారు.
ఇకపోతే ఐ బొమ్మ రవిని చంచల్ గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ కస్టడి(Cyber Crime Custody)కి తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో రవిని సైబర్ క్రైమ్ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు రవికి సైబర్ క్రైమ్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారణ కొనసాగించబోతున్నారని తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా పైరసీకి సంబంధించి మరికొన్ని సంచలన విషయాలను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. రవి పైరసీ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల వరకు వ్యాప్తించింది. ఈయన వెనుక పెద్ద నెట్వర్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ కస్టడీలో భాగంగా రవి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు.
వందల కోట్ల పైరసీ నెట్‌వర్క్ గుట్టురట్టు
ఇక రవి అరెస్టు అయినప్పటికీ సినిమాలు పైరసీలో అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజులకే హెచ్డి ప్రింట్ తో సహా బయటకు వచ్చింది దీంతో సినిమా పైరసీ వెనుక కేవలం రవి ప్రమేయం మాత్రమే కాదని ఈ పైరసీ వెనుక పెద్ద ముఠా ఉందని స్పష్టం అవుతుంది. ఇక రవి అరెస్టు కావడంతో కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే వ్యతిరేకించినా, రవికి మాత్రం సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా టికెట్ల రేట్లు పెంచడమే..
రవికి ప్రజా మద్దతు: వెనుకనున్న అసలు కారణం?
రవి సినిమాలను పైరసీ చేయటం ద్వారా ఎంతో మంది థియేటర్లకు వెళ్ళలేని వారు కూడా సినిమాని చూసే అవకాశం కల్పించారు అంటూ ఈయనని ఒక హీరోగా భావించి తన అరెస్టును వ్యతిరేకిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. కేవలం దర్శక నిర్మాతల కారణంగానే రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని రవి లాంటి వాళ్లను తయారు చేస్తుందే సినిమా ఇండస్ట్రీ అంటూ ఎంతోమంది రవి అరెస్టును ఖండించారు. సినిమా చేయడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆ భారం మొత్తం ప్రేక్షకులపై వేయటం వల్లే సినిమాలను ఇలా పైరసీలో విడుదల చేస్తున్నారని సినిమా టికెట్ల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే ఎవరు కూడా పైరసీలో సినిమాలను చూడాలనుకోరు. ఇలా సినిమాలు పైరసీ అవుతున్నాయి అంటే అందుకు కారణం దర్శక నిర్మాతలేనని ముందు వారి ధోరణి మార్చుకోవాలి అంటూ పలువురు రవి అరెస్టు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఐ బొమ్మ రవి అరెస్టుతో పైరసీకి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం అయింది. అయితే, రవికి లభిస్తున్న ప్రజా మద్దతు, సైబర్ క్రైమ్ విచారణలో బయటపడే నిజాలు ఈ వివాదానికి కొత్త మలుపుని ఇవ్వనున్నాయి.


