
📌 Key Points
- శివకార్తికేయన్, కమల్ హాసన్ నిర్మాణంలో ‘సెయాన్’ చిత్రం.
- శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం.
- ఫస్ట్ లుక్‌లో డివైన్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో శివకార్తికేయన్.
- 2026లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సెయాన్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ డివైన్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.
సెయాన్ ఫస్ట్ లుక్ విడుదల
Seyon First Look: కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan). హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ‘అమరన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన శివకార్తికేయన్, ఇప్పుడు మళ్ళీ అదే నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) తో చేతులు కలిపారు. శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘సెయాన్’ (Seyon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ (Seyon First Look)ను విడుదల చేశారు. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారనే విషయం ఈ ఫస్ట్ లుక్ తెలియజేస్తుంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. 2026లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ (Kamal Haasan), ఆర్. మహేంద్రన్ అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.
శివకార్తికేయన్ కొత్త అవతారం
ఇక మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే.. శివకార్తికేయన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక డివైన్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకుని, నుదుటన విభూతి, మెడలో రుద్రాక్షలతో కనిపిస్తూనే.. చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఉన్న తీరు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ముఖ్యంగా పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు చూస్తుంటే ఈ సినిమాకి మురుగన్ స్వామి థీమ్‌తో ఏదో లోతైన కనెక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. శాంతంగా కనిపిస్తూనే శత్రు సంహారం చేసే ఒక శక్తివంతమైన పాత్రలో శివకార్తికేయన్ మెరవబోతున్నారనేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇంతకు ముందు ఇదే బ్యానర్‌లో సైనికుడిగా కనిపించిన శివకార్తికేయన్, ఈసారి మాత్రం దైవశక్తిని నమ్ముకున్నట్లుగా అర్థమవుతోంది.
2026లో విడుదల కానున్న చిత్రం
ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. సంతోష్ నారాయణన్ సంగీతం. రాజ్‌కమల్ ఫిలిమ్స్, శివకార్తికేయన్, సంతోష్ నారాయణన్ ముగ్గురూ కలిసి పని చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. సంతోష్ తన వైవిధ్యమైన మ్యూజిక్ స్టైల్‌తో ‘సెయాన్’ సినిమాకు ప్రాణం పోస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శివకార్తికేయన్ నుంచి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇందులో నటించే హీరోయిన్ ఎవరనేది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా (Turmeric Media) విజన్ కలిసి నిర్మిస్తోన్న ఈ ‘సెయాన్’ చిత్రం.. 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటని చెప్పుకోవచ్చు.
మొత్తానికి శివకార్తికేయన్ ‘సెయాన్’ ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేశారు. కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


