
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఇంటిలోని చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. శని దేవుడు పడమర దిక్కుకు అధిపతి. పడమర దిశలో చేయాల్సినవి, చేయకూడని విషయాల గురించి తెలుసుకుందాం.
Key Points
పడమర దిక్కులో పడకగది ఉండకండి.
వంటగదిని పడమర దిశలో ఏర్పాటు చేయవద్దు.
పడమర దిక్కులో పూజగది ఉంచడం శుభప్రదం కాదు.
పనికిరాని వస్తువులను పడమర దిక్కులో ఉంచకండి.
పడమర దిశలో ఏమి చేయకూడదు?
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటారు. అయితే మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన ఇంట్లో పెట్టే సామాన్లు లేదా మన ఇంట్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం ఇంట్లో కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. శని కేవలం మన జాతకంలోనే కాదు, మన ఇంట్లో ఉండే దిశల్లో కూడా ఉంటాడు. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం శని ఏ మాత్రం క్షమించడు.
వాస్తు ప్రకారం ప్రతి దిశకి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే ప్రత్యేక ఫలితాలను మనం చేసే వాటి ద్వారా పొందవచ్చు. కొన్ని విషయాలకు కొన్ని దిశలు అనుకూలంగా ఉంటాయి. వాస్తు ప్రకారం ప్రతి దిక్కుకి అధిపతులు కూడా ఉంటారు. మరి శని దేవుడు దిశకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
శని దేవుడు పడమర దిక్కుకు అధిపతి. అయితే వాస్తు ప్రకారం శని దిశలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. మరి ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని తప్పులు చేయడం వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పడమర వైపు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకండి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, కెరియర్‌లో ఇబ్బందులు, రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
శని దోషం నివారణకు చర్యలు
పడకగది ఎప్పుడూ కూడా పడమర వైపు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే కెరియర్‌లో సమస్యలు వస్తాయి. ఆ ఇంట్లో భార్యాభర్తలు నిద్రపోయినట్లయితే మరి రిలేషన్‌షిప్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది.
వంటగదిని పడమర వైపు ఉంచకండి. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
పడమర వైపు పూజ గది ఉండడం కూడా మంచిది కాదు. అలా ఉన్నట్లయితే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.
పడమర దిశకు సంబంధించిన వాస్తు సూచనలు
ఒకవేళ ఇంటి ముఖద్వారం పశ్చిమం వైపు ఉన్నట్లయితే, ఇంటి ముందు నీడ ఇచ్చే చెట్టును నాటాలి. ఒకవేళ కిటికీలు ఉంటే, అవి తూర్పు వైపు ఉన్న కిటికీల కంటే చిన్నవి అయ్యుండాలి.
ఎప్పుడూ కూడా పడమర వైపు పనికిరాని ఫర్నిచర్‌ను పెట్టొద్దు. దాని వలన పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆర్థికపరంగా సమస్యలు వచ్చి ఇబ్బంది పడాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పడమర దిక్కును శని పాలిస్తున్నందున, ఈ దిశలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు సూత్రాలను పాటించి, శని దోషం నుండి తప్పించుకోవచ్చు. శుభకార్యాల కోసం శనివారం శుభసమయం.


