|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ష‌ర్వానంద్ ‘బైకర్’: ప్రీమియం ఫార్మాట్లలో విడుద‌ల! ఏప్రిల్ 3న థియేట‌ర్ల‌లో యాక్ష‌న్ వినోదం

Published: 05-03-2026, 3:05 PM
ష‌ర్వానంద్ 'బైకర్': ప్రీమియం ఫార్మాట్లలో విడుద‌ల! ఏప్రిల్ 3న థియేట‌ర్ల‌లో యాక్ష‌న్ వినోదం
  • శర్వానంద్ ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
  • ఈ సినిమా డాల్బీ సినిమా, EPIQ, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.
  • శర్వానంద్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు.
  • రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల్’ పాత్రలో నటిస్తున్నారు.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమా డాల్బీ సినిమా, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుండటం విశేషం. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు.

ఏప్రిల్ 3న ‘బైకర్’ విడుదల

Biker: సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) సక్సెస్ తర్వాత చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) నుంచి రాబోతున్న అడ్రెనలిన్‌ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బైకర్’ (Biker). భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుందంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ ఆసక్తికర అప్డేట్‌ను వదిలారు. అదేంటంటే..

ప్రీమియం ఫార్మాట్లలో సినిమా విడుదల

ఈ చిత్రం డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతిని ఈ సినిమా అందించనుందని తెలుస్తోంది. హార్ట్-పౌండింగ్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో మేకర్స్ విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి బైక్ రోర్, ప్రతి ఎమోషనల్ సన్నివేశం థియేటర్‌లో మరింత ప్రభావం చూపేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ టీజర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేయడంతో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బలంగా జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. గత కొంతకాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వాకు ‘నారీ నారీ నడుమ మురారి’ రూపంలో మంచి హిట్ వచ్చింది. ఇకపై తన నుంచి వచ్చే చిత్రాలన్నీ కచ్చితంగా సక్సెస్ అవుతాయనే నమ్మకాన్ని ఇటీవల శర్వా ఓ వేడుకలో తెలిపిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు నమోదవుతున్నాయి.

మోటార్‌సైకిల్ రేసర్‌గా శర్వానంద్

ఇక ఈ చిత్రంలో శర్వానంద్ డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలు ప్రేక్షకులకు యమా కిక్కిస్తోన్న విషయం తెలియంది కాదు. సీనియర్ హీరో, యంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Angry Man Raja Sekhar) ‘బుల్లెట్ సునీల్’ అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపించనున్నారు. శర్వా సరసన హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తున్నారు. భారీ యాక్షన్, ఎమోషన్స్, టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

శర్వానంద్ ‘బైకర్’ చిత్రం మోటోక్రాస్ నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా. ఈ చిత్రం ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.