
📌 Key Points
- శర్వానంద్ తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
- పెళ్లికి సిద్ధమైన హీరో జీవితంలో మాజీ ప్రేయసి అనూహ్య ఎంట్రీ ప్రధాన కథాంశం.
- రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమ్యుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు.
- శర్వానంద్ కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారనుంది.
శర్వానంద్ తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. పెళ్లికి ముందు హీరో మాజీ ప్రేయసి ఎంట్రీతో కథలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
నారి నారి నడుమ మురారి: హైప్ అండ్ అంచనాలు
Nari Nari Naduma Murari: శర్వానంద్ కొత్త సినిమా ‘నారి నారి నడుమ మురారి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన హీరోలలో శర్వానంద్ ఒకరు. కానీ ఈ మధ్య శర్వా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది. కానీ శర్వా నటిస్తున్న తాజా సినిమా ‘నారి నారి నడుమ మురారి’ ఇప్పటికే మంచి బజ్‌ను సంపాదించుకుంది.
ఈ సినిమా టైటిల్, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని పెంచాయి. వినోదం, ప్రేమ, కామెడీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి హిట్ అవ్వనుంది అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సమ్యుక్త, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకి కీలక పాత్రలు ఉన్నాయని టాక్ కూడా ఉంది.
కథ విషయానికి వస్తే ఒకవైపు పెళ్లికి సిద్ధంగా ఉన్న హీరో, మరోవైపు సడన్ గా ఎంటర్ అయిన అతని మాజీ ప్రేయసి నేపథ్యంలో జరిగే సంఘటనలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయట. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో చేసిన సినిమా సమాజ వరగమన. శ్రీ విష్ణు నటించిన ఆ సినిమా చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శర్వానంద్ కొత్త సినిమాలో కథా నేపథ్యం ఇదేనా?
నూతన సంవత్సర సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన శర్వానంద్ స్పెషల్ ట్రెడిషనల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంచె, కుర్తాతో కనిపించిన శర్వా లుక్‌కి ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. పండుగ వాతావరణాన్ని చూపిస్తూ వచ్చిన ఆ లుక్ తో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఈ సినిమాను కిషోర్ గరికపాటి, రాంభరమం సుంకర నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చిత్ర బృందం చెబుతోంది. ‘నారి నారి నడుమ మురారి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. మరి శర్వానంద్ కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్‌గా నిలుస్తుందా లేదా చూడాలి.
కెరీర్‌కు ఈ సినిమా కీలకం కానుందా?
గత కొంత కాలంగా శర్వా కెరీర్ బాగా డౌన్ అవుతున్న సమయంలో “ఒకే ఒక్క జీవితం” మంచి హిట్ అయ్యింది కానీ తర్వాత వచ్చిన “మనమే” సినిమా మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. ఇక నారి నారి నడుమ మురారి సినిమా శర్వా కి ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి. 1990 లో బాలకృష్ణ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి సూపర్ హిట్ అయ్యింది. మరి అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా శర్వా కెరీర్ కి ఎంత బూస్ట్ ఇస్తుందో చూడాలి.
మొత్తం మీద ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్‌కు ఊపునిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పండుగ సీజన్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.


