
తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన షాజన్ పదమ్సీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. ‘ఆరెంజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి, తన వివాహ వార్తను అభిమానులతో పంచుకుంది.
Key Points
రామ్ చరణ్ సినిమాల్లో నటించిన షాజన్ పదమ్సీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది.
మూవీ మాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనకియాతో వివాహం.
ముంబైలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది.
జూన్ 7న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
షాజన్ పదమ్సీ వివాహం
రామ్ చరణ్ ‘ఆరెంజ్’ … చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్‌గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన ‘మసాలా’ మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్‌గా ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?
మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.
మూవీ మాక్స్ సీఈఓతో వివాహ బంధం
గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?
గ్రాండ్ రిసెప్షన్
షాజన్ పదమ్సీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆమె భవిష్యత్తులో సినిమాల్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, ఆమెకు శుభాకాంక్షలు.


