
📌 Key Points
- రామ్ చరణ్ “పెద్ది” సినిమా డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం.
- టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ధరకు డీల్ కుదిరినట్లు సమాచారం.
- “RRR” విజయం తర్వాత చరణ్ గ్లోబల్ మార్కెట్ విలువ పెరిగింది.
- జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో భారీ ధరకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.
“పెద్ది” సినిమాపై భారీ అంచనాలు
Peddi OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘RRR’ చిత్రంతో అంతర్జాతీయంగా ఆస్కార్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ఒక ఊర మాస్, రస్టిక్ స్పోర్ట్స్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈరోజే ప్రీమియర్స్ పడగా అఫీషియల్ గా రేపు అనగా 2026 జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ కంటే ముందే డిజిటల్ బిజినెస్‌లో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించి ట్రేడ్ వర్గాలను పెద్ద షాకే ఇస్తుంది.
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్
సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే డిజిటల్ మార్కెట్‌లో ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది, అందునా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కావడంతో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఏర్పడింది . అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి దిగ్గజ సంస్థలు రేసులో ఉన్నప్పటికీ, చివరికి సాలిడ్ డీల్‌తో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ వాల్యూని దృష్టిలో ఉంచుకుని, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఊహించని రేంజ్‌లో ఫ్యాన్సీ రేటును చెల్లించి మరీ సౌత్ అండ్ నార్త్ అన్ని లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.
నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న డిజిటల్ హక్కులు
జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో
గతంలో చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ హిందీ వర్షన్ డిజిటల్ రైట్స్ ద్వారా అద్భుతమైన వ్యూయర్‌షిప్ లభించడంతో, ఈసారి ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఫుల్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే, సాధారణంగా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు ఉండే ఎనిమిది వారాల (56 రోజులు) విండో రూల్ ప్రకారమే ‘పెద్ది’ ఓటీటీ అగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం. సినిమా రేపు జూన్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతున్నందున, బాక్సాఫీస్ వద్ద దీని లాంగ్ రన్‌ను బట్టి దాదాపు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ ప్రభావం
సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను పలకరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించగా, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడం సినిమాకు మరో మెయిన్ ఎస్సెట్ . అంతకుముందు రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ చిత్రం ఏ రేంజ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందో, ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ కూడా అదే తరహాలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.చూడాలి మరి భారీ అంచనాలు మోస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ విలువ కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ డీల్‌కు సిద్ధమైంది. “పెద్ది” సినిమా జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
